హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ no5 లో వ్యభిచారం గుట్టు రట్టైంది. జూబ్లీహిల్స్ రోడ్ no5 లోని శ్రీ పద్మావతి నిలయం అపార్ట్ మెంట్స్ లో గల సీజన్ 4 స్పా లో గత కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జూబ్లీ హిల్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. అయితే.. పక్కా సమాచారం రావడంతో సోమవారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. రూ.3 వేలు చెల్లిస్తే సెక్స్ వర్కర్ కోరిన సేవలను అందిస్తుందని అక్కడ మేనేజర్ చెప్పడంతో ఆ…
కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం మలుపు తీసుకుని.. చిన్నారులను ఆమె అమ్ముకుంటుందనే ఆరోపణల వరకు వెళ్లింది. పిల్లలను దత్తత తీసుకోవడం.. ఆ తర్వాత అమ్ముకుంటుందనే ఆరోపణలు వచ్చాయి.. ఇక, మధ్యలో అదృశ్యమైన కరాటే కల్యాణి.. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను ఎక్కడికీ పారిపోలేదు.. ఇక్కడే ఉన్నానని తెలిపారు. మరోవైపు, నేను పాపను దత్తత తీసుకోలేదని స్పష్టం చేశారు. పుట్టిన బిడ్డ వన్ ఇయర్ దాకా దత్తతకు అర్హులు కాదు.. నాకు చట్టాల మీద…
కాకినాడలో అదృశ్యమైన ఓ బాలిక సికింద్రాబాద్‌లో శవమై కనిపించింది.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం కాగా.. చికిత్స పొందుతూప్రాణలు వదిలింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ ఎల్లంగిరి ప్రాంతనికి చెందిన మైనర్ బాలిక.. తెనాలికి చెందిన హరికృష్ణతో చనువుగా ఉండేది.. రెండు వారాల క్రితం ఇద్దరు.. ఇళ్లు వదిలి సికింద్రాబాద్ చేరుకోగా.. మారేడుపల్లిలో అపస్మారక స్థితిలో ఉన్న వీరిద్దరిని.. స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు..…
సినీ నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం మలుపుమీద మలుపు తీసుకుంటూ సాగుతోంది.. ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండ పోవడం చర్చగా మారగా.. అజ్ఞాతం వీడి మీడియా ముందు ప్రత్యక్షం అయ్యారు కరాటే కల్యాణి.. తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారో నాకు తెలుసన్న ఆమె.. త్వరలో అందరిపేర్లు బయటపెడతా.. నాకు చాలా రోజులుగా అన్యాయం జరుగుతోంది.. చాలామంది మీద ఫైట్ చేస్తాను, నిలదీస్తాను, తంతాను కూడా అన్నారు. అయితే, కొన్ని రాజకీయ శక్తులు…
సినీ నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి వివాదం కొత్త మలుపు తీసుకోవడం.. నోటీసులు, కిడ్నాప్‌లు.. ఇలా రకరకాల కథనాలు నడుస్తున్నాయి.. ఇద్దరిపై ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదు కావడం.. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండ పోవడం చర్చగా మారింది.. అయితే.. ఈ వ్యవహారంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఆమె సోదరుడు తారక్..కరాటే కల్యాణి నిన్న గుడికి వెళ్తున్నా అని చెప్పి వెళ్లి ఇప్పటి వరకు ఇంటికి రాలేదన్న ఆయన.. మా అక్క…
ఏపీలో ఈ మధ్య జరిగిన టెన్త్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. అయితే, ఈ నెల నుంచి తెలంగాణలోనూ టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. దీంతో, అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.. పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని…
తెలంగాణలో ఇంటర్ విద్యా సంవత్సరం ఈసారి ఆలస్యంగా ప్రారంభం కానుంది.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 20వ తేదీ నుండి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. జూన్ 15వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పునః ప్రారంభం కాబుతున్నాయి.. ఇక, జులై 1వ తేదీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.. అయితే, ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది.…
వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు లిక్కర్ అమ్మకాలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి.. కొన్ని భయాలు కూడా.. లిక్కర్, బీర్ల సేల్స్‌ను ప్రభావితం చేస్తాయి… అయితే, కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితి కొంత మారింది… కూల్‌గా బీర్లు లాగించేవారు కూడా.. క్రమంగా వైన్, బ్రాండీ సేవించారు.. అయితే, ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది.. కరోనా భయాలు తొలగడంతో.. ఎండల తీవ్రత పెరడగంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరగడంతో లిక్కర్కంటే బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది.. మార్చి నుంచి మే…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ అకాల వర్షం రైతులను తీవ్ర నిరాశ పరిచింది. నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం…