బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. గత కొన్ని రోజులుగా సల్మాన్ ను చంపేస్తామంటూ ముంబై గ్యాంగ్ స్టార్ బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో సల్లు భాయ్ హైదరాబాద్ లో అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించే సినిమాల్లో సగభాగం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోనే నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఈ హీరో కొత్త సినిమా ‘కబీ ఈద్ కబీ దివాళి’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్ను కూడా నిర్మించారు. ఇందుకోసం తప్పక సల్మాన్ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అయితే చావు బెదిరింపుల నేపథ్యంలో సల్లు భాయ్ కు భద్రతను పెంచారు పోలీసులు.. ఇంతకు ముందు ఎప్పుడు లేని హై సెక్యూరిటీ తో సల్లూ భాయ్ హైదరాబాద్ లో అడుగుపెట్టాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్.. సల్మాన్ ను చంపేది తనేనంటూ ఒక లేఖ కూడా విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పంజాబ్లో ప్రముఖ సింగర్ సిద్దును ఎలాగైతే చంపామో ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు కూడా అదే గతి పడుతుంది అని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా సల్మాన్ ఇందటివద్ద కూడా భద్రతా దళాన్ని పెంచేశారు.