జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో విషయం బట్టబయలైంది. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు ఇన్నోవా కారులో మొయినాబాద్‌కు వెళ్లినట్టు తేలింది. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం పొందినట్టు తెలిసింది. ఆ ఫామ్‌హౌస్ వెనకాలే ఇన్నోవా కారుని దాచిన నిందితులు.. వాహనానికి ఉన్న గవర్నమెంట్ స్టిక్కర్‌ను సైతం తొలగించినట్లు సమాచారం. ఆ ఫామ్‌హౌస్‌లో సేద తీరిన తర్వాత, అక్కడి నుంచి నిందితులు వేర్వేరు చోట్లకు పరారీ అయినట్లు తెలుస్తోంది.
పోలీసుల్ని గందరగోళానికి గురి చేసేందుకు.. నిందితులు తమ సిమ్‌కార్డుల్ని ఇద్దరు వ్యక్తుల ఫోన్లలో వేసి, వాళ్లను గోవా పంపించారు. ఇటు నిందితులేమో కర్ణాటకకు వెళ్లారు. అయితే.. సంచలనం రేపిన ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, దర్యాప్తును వేగవంగం చేసి, నిందితుల ఆచూకీ తెలుసుకొని ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారిలో ఇద్దరు మేజర్లు కాగా.. మిగిలిన ముగ్గురు మైనర్లే! వీళ్లందరూ రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకూ ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల జాబితా..
A1 – సాదుద్దీన్ (MIM నేత కుమారుడు)
A1 – ఉమేర్ ఖాన్ (MLA సోదరుడి కుమారుడు)
మైనర్1 – వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు
మైనర్2 – MIM కార్పొరేటర్ కుమారుడు
మైనర్3 – సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్సన్ మెంబర్ కుమారుడు