హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ప్రమాదం జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రోగ్రాం ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. కుమార అమ్మిరేశ్ అనే డీఎస్పీ క్యాడర్ అధికారి మృతి చెందారు. మాదాపూర్ శిల్పకళా వేదికలో ఎల్లుండి జరగబోయే సిరివెన్నెల సీతారామశాస్త్రి బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు. ఇక కార్యక్రమం ఏర్పాటు పైన నివేదిక ఇవ్వడం కోసం రిహార్సల్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న డీఎస్పీ స్టేజి సమీపంలో ఉన్న గుంతలో పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన డీఎస్పీని ఆస్పత్రికి తరలించగా…
ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.. దీంతో, అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతున్నారు. కోచింగ్ సెంటర్లు చుట్టూ పరుగులు పెడుతున్నారు.. ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్లు.. సొంతంగా ప్రిపేర్ అయ్యేవాళ్లు కూడా లేకపోలేదు.. అయితే, తాము కూడా పరీక్షలు రాస్తాం.. మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ట్రాన్స్ జెండర్స్.. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్లికేషన్లో పురుషులు, మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారని.. మాకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.…
తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. చత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లకు పిలుస్తోందని మండి పడ్డారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు, వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారు అని చెప్పే చిత్తశుద్ది బిజెపి…
ఫలితాలు ఊరికే రావు. ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యాచరణలో అధికారులు శ్రద్ధాసక్తులతో, చిత్తశుద్ధితో పాల్గొన్నప్పుడే ఫలితాలు సాధ్యమైతాయని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుతుగున్న ఈ సమావేశానికి మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు. ఈ…
బేగంపేట్ చికోటి గార్డెన్ జీవన్ జ్యోతి హాల్ లో ఫాస్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా కే.ఏ.పాల్ హాజరుకానున్నారు. ఐతే ఈ సమావేశానికి పోలీసులు అనుమతి లేదంటూ.. బేగంపేట్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కే ఏ పాల్ ఇక్కడికి వస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే దీనిపై కేఏ.పాల్ స్పందించారు. పోలీసుల తీరుపై పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరాయి వ్యక్తులను అడ్డుపెట్టి తన సమావేశాన్ని అడ్డుకోలేరని…
చిన్న చిన్నవాటికి క్షణికావేశం పెద్ద సమస్యలను తీసుకువస్తున్నాయి. ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా లంగర హౌజ్ లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. తన గర్ల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పాడనే కారణంతో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు మరో యువకుడు. ఈ ఘటన సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఫిలింనగర్ కు చెందిన ఓ యువతి లంగర్ హౌజ్ లో ఉండే రోహన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. అయితే యువతి…
ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా భారీ ఎత్తున బెట్టింగులు పెడుతున్నారు. ఒక్కో మ్యాచ్ కు కొన్ని వందల కోట్లు చేతులు మారుతున్నాయి. అధికారులు బెట్టింగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా బెట్టింగ్ కు ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ బెట్టింగ్ పై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని నాలుగు చోట్ల సోదాలు చేశారు సీబీఐ అధికారులు. 2103 నుంచి పాకిస్తాన్ కేంద్రంగా ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని సాకుగా చూపించి ఫిట్నెస్ ధ్రువీకరణ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ఒక రోజు ఆటో, క్యాబ్, లారీల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కౌంటర్ సిగ్నేచర్ పర్నిట్ ( సింగిల్ పర్మిట్ ) దేశంలోని ప్రతి రాష్ట్రం పొరుగు రాష్ట్రానికి ఇస్తున్నట్లుగా…
రాజ్ భవన్ పాఠశాల మ్యాగజైన్ను గవర్నర్ తమిళి సై ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు రూపొందించిన సాహిత్య, కళాకృతుల సంకలనాన్ని ఆలకించారు. మ్యాగజైన్ లో రాజ్ భవన్ పాఠశాల 2017 నుండి 2022 వరకు సాధించిన విజయాల ప్రస్తావన వుంటుందని గవర్నర్ తమిళి సై తెలిపారు. పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించడానికి మ్యాగజైన్స్ ఉపయోగపడుతాయని అన్నారు. నేను కూడా చాలా ఆర్టికల్స్ రాశానని పేర్కొన్నారు. రోటీన్ గా చదవడం, రాయడమే కాకుండా స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాల…