హైదరాబాద్ కు చెందిన టెక్ పవర్డ్ కన్ స్ట్రక్షణ్ అగ్రిగేటర్ ఇటీవల వీహైజ్ బ్రాండ్ గా చేయబడింది. హోకోమోకో మొదటి ఫండింగ్ రౌండ్ లో యాంథిల్ వెంచర్స్, ఏంజెల్ ఇన్వెస్టర్ల గ్రూప్ నుంచి వన్ మిలియన్ యూఎస్ డాలర్లను సేకరించింది. టెక్నాలజీని అప్ గ్రేడ్ చేయడంతో పాటు భారత్ లోని ఇతర నగరాలకు విస్తరించడంలో ఈ నిధులను ఉపయోగించనుంది.
వీహౌజ్ టెక్ అగ్రిగేటర్ ప్లాట్ ఫామ్. ఇది ఎండ్ టూ ఎండ్ నిర్మాణ సేవలను సులభతరం చేస్తుంది. కస్టమర్లు తమ ఇంటి కలలను సాకారం చేసుకోవడానికి స్వయంగా చట్టపరమైన అనుమతులు, ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ డిజైన్స్, నిర్మాణ అమలు నుంచి ఇంటీరియర్స్, మానిటరింగ్ సేవలను అందిస్తుంది. వినియోగదారుడు పని పురోగతిని ఫోటోలు, వీడియోల ద్వారా ఆన్ సైట్ మెటీరియల్ వినియోగాన్ని తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది. నిఘా భద్రత కలిగిన ప్రాజెక్ట్ సైట్ ను అందిస్తుంది.
నిధులు, రీ బ్రాండింగ్ గురించి వీహౌజ్ సీఈఓ శ్రీపాద్ నందిరాజ్ మాట్లాడుతూ.. ఒక కార్పోరేట్ సంస్థను వ్యవస్థాపక తత్వానికి అనుగుణంగా ఉంచడం పునరావిష్కరణ ఒక ముఖ్యమైన భాగం అని అన్నారు. మా బ్రాండ్ కొత్త పేరు వ్యక్తిగత ప్రపంచం, దృష్టి కోణాన్ని కలిగి ఉందని.. ఒక కంపెనీగా మా క్లయింట్స్ తో కలిసి ఒక కుటుంబంగా వారి కలల ఇంటిని నిర్మిస్తామని అన్నారు. మేము సరైన దిశలో ప్రయాణిస్తున్నామని.. మా సంస్థ ఆకర్షిస్తున్న కొత్త పెట్టుబడులు, నిధులు మా సాంకేతికతను మెరుగుపరచడానికి, స్కేలబిలిటీ కోసం ఉపయోగపడుతాయిని ఆయన అన్నారు. ప్రస్తుతం వీహౌజ్ ప్రాజెక్టులో 2000 మంది పరోక్షంగా ఉపాధి పొందతున్నారని..మేము ఈ సంఖ్యను మరింత పెంచుతూ.. మరిన్ని ఉద్యోగాలు, ఉపాధి ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
యాంటిల్ వెంచర్స్ భాగస్వామి శైలేష్ సిగటాపు మాట్లాడుతూ.. వీహౌజ్ లో పెట్టుబడులు పెట్టడం పట్ల సంతోషిస్తున్నట్లు వెల్లడించారు. ఒక కంపెనీగా సొంత ఇంటి నిర్మాణానికి సాంకేతికతను వర్తింపచేయబడుతోందో వీహౌజ్ చక్కని నిర్వచనం ఇస్తున్నారని అన్నారు. ఈ రంగంలో వారి దృష్టి, ఆవిష్కరణల పట్ల మేము చాలా సంతోషిస్తున్నామని అన్నారు. వీహౌజ్ వంటి స్టార్టప్ దాని టెక్నాలజీ-ఫస్ట్ విధానం, లోతైన డొమైన్ నైపుణ్యంతో ఛిన్నాభిన్నం అయిన మార్కెట్ ను నిర్వహించడానికి పెద్ద అవకాశాన్ని కలిగి ఉంటుందని గట్టిగా విశ్వసిస్తున్నామని అన్నారు.
నిర్మాణ పరిశ్రమ 2023లో 250 బిలియన్ డాలర్ల నుంచి 2027లో 530 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచానా వేస్తున్నారు. కాంపౌండ్ ఏడాది గ్రోత్ రేట్ 7.8 శాతంగా ఉందని, దీంట్లో వీహౌజ్ ఈ పెరుగుతున్న మార్కెట్ లో సరసమైన వాటాను పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక మిలియన్ చదరపు అడుగుల బిల్ట్ – అప్ ఏరియాను పూర్తి చేసిన వీహౌజ్ నేపథ్యంలో కొత్త నిధులు అందించబడ్డాయి. రాబోయే కొద్ది నెలల్లో వీహౌజ్ రూ.100 కోట్ల ఆదాయాన్ని చేరుకోనున్నారు.