ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆయన ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకి వెళ్లనున్నారు. 10 గంటలకు బేగంపేట నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. 11 గంటలకు హాల్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. 11.15 నిమిషాలకు లీలా ప్యాలస్ హోటల్కి చేరుకోనున్నారు. 11.45 హోటల్ నుంచి మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి బయల్దేరి వెళ్లనున్నారు. 12.30 మాజీ ప్రధాని దేవగౌడ ఇంటికి చేరుకోనున్నారు. దేశ రాజకీయాలపై, రాష్ట్రపతి అభ్యర్థిపై మాజీ…
చార్మినార్లోని లాడ్ బజార్లో రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చలరేగాయి. దీంతో క్రమంగా మంటలు షాప్ మొత్తం వ్యాపించడంతో.. దుకాణం పూర్తిగా దగ్ధమయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. దీన్ని గమనించిన స్థానికి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరకున్నారు. ఫైర్ ఇంజన్ సాయంతో దాదాపు 2 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది…
గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో జంక్షన్ వరకు ఉన్న ఐటీ కంపెనీలు తమ ఆఫీస్ టైమింగ్స్ మార్చుకోవాలని సూచించింది. ఈ రూట్లల్లో ప్రయాణం.. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి:…
కరీంనగర్లో కొనసాగిస్తోన్న హిందూ ఏక్తా యాత్ర భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మసీదులు తవ్వి చూద్దామని అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరిన ఆయన.. ‘శవం వస్తే మీది, శివలింగం వస్తే మాది’ అని అన్నారు. లవ్ జిహాదీ, మత మార్పుడులను చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణలో బీజేపీ వస్తే ఊర్దూని నిషేధిస్తామని, మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామని కుండబద్దలు కొట్టారు. కశ్మీర్ ఫైల్స్లా తెలుగు రాష్ట్రాల్లో రజాకార్ ఫైల్స్ చూపిస్తామని…
రేపు హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవం జరగనుంది. హైదరాబాద్ తో పాటు మొహాలీ క్యాంపస్ లకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొంటున్నారు. అంతర్జాతీయంగా మేనేజ్ మెంట్ శిక్షణ అందించే అత్యున్నత స్థాయి బిజినెస్ స్కూల్. దీంతో హైదరాబాద్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) హైదరాబాదులోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాలగా పేరు పొందింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థినీ, విద్యార్ధులకు అంతర్జాతీయ సంస్థల్లో…
పదిరోజులకోసారి ప్రసాద్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళొచ్చే ఓ వివాహిత.. అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిస్థితిలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కొత్తపల్లికి చెందిన ప్రసాద్(35), గత ఆరు నెలల నుంచి ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్లో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. కుక్గా పని చేసే ఇతని ఇంటికి.. శిరీష అనే మహిళ ప్రతి పదిరోజులకోసారి వచ్చి వెళ్తుండేది. ఈ…
https://www.youtube.com/watch?v=HsGrjepw3Vw ప్రముఖ మీడియా సంస్థ NTV ఛైర్మన్ శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారికి విశ్వహిందు పురస్కార ప్రదానం జరిగింది. అవధూత దత్తపీఠం, మైసూరువారు ఈ పురస్కార ప్రదానం చేశారు. సనాతన ధర్మాన్ని వ్యాప్తిచేసే విశిష్ట వ్యక్తులకు దత్తపీఠం అందించే అరుదైన పురస్కారం విశ్వహిందు పురస్కారం. గత 15 సంవత్సరాలుగా సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న భక్తి టీవీ కృషిని యావత్ దేశం గుర్తించింది. ప్రశంసలు కురిపిస్తోంది. దక్షిణాదిలో నెం. 1 ఆధ్యాత్మిక ఛానల్ గా…
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. ధూల్ పేటలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు డ్రగ్ పెడ్లర్లతో పాటు ఒక ఆఫ్రికా దేశస్థుడిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ను తరలించేందుకు వాడుతున్న ఇన్నోవా కార్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రీకన్ దేశస్తుడు, సందీప్ అనే వ్యక్తికి అమ్ముతున్న క్రమంలో పురానా పూల్ వద్ద పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. హోండా యాక్టీవా పట్టుకున్నామని.. అందులో ఏడు గ్రాముల కొకైన్ దొరికినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ వెల్లడించారు. ఆఫ్రికా…
యాంగ్రీమెన్ రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర్’ సినిమా టీమ్కు గుడ్ న్యూస్ అందింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన పిటిషన్ను సోమవారం నాడు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో పాటు శేఖర్ సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. Tollywood: హీరోల్లో మార్పు వస్తుందా..? బడ్జెట్స్ తగ్గుతాయా..? కొంతమంది ఉద్దేశపూర్వకంగా శేఖర్ సినిమా ప్రదర్శనకు…
కుటుంబాల్లో వివాహేతర సంబంధాలు అగాథం సృష్టిస్తున్నాయి. అనుమానాలతో భార్యను భర్త, భర్తను భార్య వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఎవరో ఒకరు బలవన్మరణాలకు పాల్పడడం, లేదా హత్యలకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఉప్పర్ పల్లి లో రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ కి భార్య పిల్లలు వున్నారు. అయితే, భార్య ఉండగా ఓ యువతి తో వివాహేతర సంబంధం…