డీమార్ట్ స్టోర్ లలో కాస్త తక్కువ ధరలకే కావాల్సిన సరుకులు లభిస్తుండడంతో కస్టమర్లు క్యూ కడుతుంటారు. గృహోపకరణాలు, వంటింటి సామాన్లు, దుస్తులు ఇలా ఒకటేమిటి డీమార్ట్ లో దాదాపు అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే ఇటీవల కొంతమంది కస్టమర్లు డీమార్ట్ లోకి వెళ్లి చాక్లెట్స్ తినడం, నట్స్ తిని డీమార్ట్ సిబ్బందికి దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో చెప్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఘటనలు తెలిసిందే. కాగా తాజాగా ఓ కస్టమర్…
బీజేపీకి రాజీనామా చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ.. రాష్ట్ర కార్యాలయంలో.. నేతల ముఖం మీదే చెప్పేసి వెళ్ళిపోయారాయన. అటు నాయకత్వం కూడా.. ఆయన క్రమశిక్షణారాహిత్యం పరాకాష్టకు చేరిందని ప్రకటించింది.
HYDRA: వర్షాల వేళ.. నగరంలోని పలు ప్రధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. నాలా ఆక్రమణలను ప్రత్యక్షంగా చూసి వెంటనే తొలగించడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు పడినప్పుడు మూసీ నదీ పరీవాహకం కంటే.. ఎక్కువ కూకట్పల్లి, జీడిమెట్ల నాలాలే ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు డాక్టర్లు పలు పరీక్షలు చేస్తున్నారు. ఆయన వెంట సతీమణి శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కూడా వెళ్లారు. గతంలోనూ కేసీఆర్ అనారోగ్య సమస్యతో యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు.
Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎల్లుండే పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. శనివారం నాడు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి.. ఉదయం 10 గంటలకు బీజేపీ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో మలబార్ జెమ్స్ తయారీ యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నారు.
Ariyana : బిగ్ బాస్ తో అరియానా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుంచే వరుసగా ఆఫర్లతో దూసుకుపోతోంది. బిగ్ స్క్రీన్ మీద ఆఫర్లు రావట్లేదు గానీ.. బుల్లితెరపై బాగానే ఛాన్సులు వస్తున్నాయి. రెండు సార్లు బిగ్ బాస్ కు వెళ్లిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బుల్లితెరపై ఛాన్సులు అందుకుంటోంది. తాజాగా తన లవ్ స్టోరీని మరోసారి చెప్పింది. నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుమే లవ్ లో పడ్డాను. అతను విజయవాడలో ఉండేవాడు. నేను తాండూరులో…
ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణలో కీలక అంశాలు ప్రస్తావించారు. అప్పటి మున్సిపల్ శాఖ మినిస్టర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ తెలిపారు. HMDW ఖాతా నుంచి FEO కంపనీకి నిధులు మల్లింపుపై నా ప్రమేయం ఆయన లేదని తేల్చి చెప్పారు.
నేటి రోజుల్లో విద్య చాలా కాస్ట్లీ అయిపోయింది. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు లక్షల రూపాయల ఫీజులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని తల్లిదండ్రులు కాయాకష్టం చేస్తూ ఫీజులు చెల్లిస్తున్నారు. అయితే కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూనే.. లేట్ ఫీజుల పేరిట దోపిడికి పాల్పడుతున్నారు. రెండు రోజులు ఫీజు కట్టడం లేట్ అయ్యిందని రూ. 3 వేలు పెనాల్టీ వసూలు చేసింది అవినాష్ కళాశాల. దీంతో విసిగిపోయిన ఆ…
మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా ఆసిఫ్ నగర్ లో భారీగా మత్తు పదార్థాలు బయటపడ్డాయి. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నైజీరియన్ ను వెంబడించి పట్టుకుని అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి పోలీసులు వెంబండించారు. ఆసిఫ్ నగర్ లోనీ ఓ అపార్ట్మెంట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఎస్ఓటీ పోలీసులు ఆసిఫ్ నగర్ లోని ఓ ఫ్లాట్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దొరికిన…