హైదరాబాద్ కొండాపూర్‌లోలోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసుల దాడి చేశారు. 2 కేజీల గంజాయి సహా మరిన్ని మత్తు పదార్థాలు సీజ్ చేశారు. ఈ రేవ్ పార్టీలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రేవ్ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. అశోక్ కుమార్ వద్ద డ్రగ్స్, గంజాయి, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులను టార్గెట్ గా చేసుకుని అశోక్ కుమార్ రేవ్ పార్టీలకు తీసుకొస్తున్నట్లు గుర్తించారు.
Also Read:Tollywood : ఒకే సారి 5 సినిమాలు స్టార్ట్ చేస్తున్న ‘యాత్ర 2’ మేకర్స్
ప్రతి వీకెండ్ లో ఆంధ్ర నుంచి యువతి యువకులను తీసుకొచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిన్న స్వాధీనం చేసుకున్న AP31SR001 ఫార్చునర్ కారుపై ఎంపీ స్టిక్కర్ ఫేక్ గా గుర్తించారు. టోల్ గేట్ల వద్ద ఫీజు కట్టకుండా తప్పించుకునేందుకే స్టిక్కర్ పెట్టుకున్నట్లు గుర్తించారు. ఎంపీ స్టిక్కర్ ఫేక్ అని ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు అనేదానిపై విచారిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అశోక్ కుమార్ కోడిపందాల వ్యాపారిగా గుర్తింపు ఉంది. ఎక్సైజ్ పోలీసులు అశోక్ ని రిమాండ్ కు తరలించారు.