మణికొండలో వాటర్ ట్యాంకర్ల అరాచకం, ఓవర్ స్పీడ్ తో విన్యాసాలు చేస్తున్న వాటర్ ట్యాంక్ డ్రైవర్లు, చోద్యం చూస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మణికొండ మున్సిపాలిటీ. మణికొండ పుప్పాలగూడలో వాటర్ ట్యాంకర్లు అరాచకం సృష్టిస్తున్నాయి. డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు నెలల్లోని నలుగురు ప్రమాదాలకు గురై చనిపోయారు, కనీసం పట్టించుకోకుండా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ చోద్యం చూస్తోంది. మణికొండ మున్సిపాలిటీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. మామూలు మత్తులో జోగటం తప్ప వారు చేసేది ఏమీ ఉండదు.
Also Read:Honor Killing : మరో పరువుహత్య.. ఎస్సైలుగా పనిచేస్తున్న తల్లిదండ్రులే కొడుకుతో హత్య..!
ట్రాఫిక్ పోలీసులు సైతం ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఈరోజు ఉదయం శాలిని అనే గృహిణి వాళ్ళ పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించి వస్తు వాటర్ ట్యాంకర్ ఢీకొని చనిపోయారు. పుప్పాలగూడ మణికొండవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాటర్ ట్యాంకర్లకు ప్రముఖ రాజకీయ నాయకుడు కి సంబంధించినవని ఆరోపిస్తున్నారు. అధికారులు మామూలు మత్తులో జోగుతూ వాహనాలను ఇష్టారాజ్యం తిరగనిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఒక వాహనానికి కూడా సరైన డ్రైవర్ గాని ఫిట్నెస్ గాని లేదని విమర్శిస్తున్నారు. తక్షణమే దందా అరికట్టకపోతే మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.