గుండె పోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా కనిపించిన వారు క్షణాల్లోనే విలవిల్లాడుతూ కుప్పకూలుతున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే తుది శ్వాస విడుస్తున్నారు. తాజాగా నాగోల్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ 25 ఏళ్ల యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది.
Also Read:Tamil Nadu: “గబ్బిలాలతో చిల్లీ చికెన్ తయారీ”.. తమిళనాడులో కలకలం..
నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు రాకేష్ అనే యువకుడు. వెంటనే స్పందించిన అక్కడున్న యువకులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేష్(25) గా గుర్తించారు. రాకేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. కొడుకు మృతితో కుటుంబంలో తీవ్ర విశాదఛాయలు అలుముకున్నాయి.