KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ యాగాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా నిర్వహించనున్నారు. ఈరోజు యాగం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ చండీ యాగం మూడు రోజుల పాటు కొనసాగనుంది. రేపటి నుంచి అధికారికంగా యాగం ప్రారంభమవుతుంది. Pulaparthi Nani: లిక్కర్…
తెలుగు రాష్ట్రాల్లో కొంత కాలంగా చైన్ స్నాచర్ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు వేసుకొని బైక్‌పై వచ్చి.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలోంచి బంగారంను ఎత్తుకెలుతున్నారు. మహిళల మెడల్లో నుంచి పుస్తెలు తాడు లేదా చైన్స్ లాక్కెళ్లిన ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్తరకం చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. Also Read: IND vs ENG: రసవత్తర ముగింపు దిశగా ఐదో టెస్ట్.. భారత్‌కు 4 వికెట్లు,…
ఎవరైనా దొంగలు ఇళ్లు దోచుకుంటారు.. ఏటీఎంలపై కన్నేస్తారు.. లేదంటే జ్యువెల్లరీ దుకాణాలపై నిఘా పెడతారు. హైదరాబాద్‌లో కొంత మంది దుండగులు వెరైటీ చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల్లో దుండగులు చేసిన చోరీ చూసి జనం అవాక్కవుతున్నారు. మోండా మార్కెట్లో జరిగిన ఈ దొంగతనం ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతోంది. ఇంతకీ ఆ దొంగలు ఏం చేశారు?. ఆవును దొంగతనం చేసిన ఘటన సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అర్థరాత్రి…
ఖరీదైన కార్లలో వస్తారు.. అక్కడే గంటల తరబడి తిష్ట వేస్తారు.. కబుర్లు చెప్పుకొని వెళ్లిపోతున్నారేమో..? లేదా మందు ఏమైనా తాగుతున్నారా? ఓ దమ్ము లాంగిచి వెళ్తున్నారేమో.. అనుకుంటే పొరపాటే.. ఎందుకుంటే.. ఇంతకీ వాళ్లు ఏం చేస్తున్నారంటూ ఫోకస్ పెట్టిన పోలీసులు.. అసలు విషయం చూసి షాక్ తిన్నారు...
HYDRA : హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బోరబండ, గచ్చిబౌలి, వనస్థలిపురం, బడంగిపేట తదితర ప్రాంతాల్లో నాళాలు, చెరువుల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు, సూచనలు చేసిన ఆయన… అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బోరబండ హైటెన్షన్ రోడ్ విస్తరణ పనులపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. నాలాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, మురుగు నీరు వరద నీటిలో కలిసిపోకుండా కిందకి పోవేలా…
దేశ క్రీడా రంగానికి దిక్సూచిగా… ఒలింపిక్స్ పతకాల వేటకు ఆట మైదానంగా…. భావి క్రీడాకారులకు మార్గదర్శిగా… ఘనమైన గత వారసత్వపు పరిమళాలను మరింతగా వ్యాపింపజేసేందుకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. ప్రతి క్రీడాకారునిలో ప్రతిభకు మరింతగా సానబెట్టి విశ్వ వేదికపై మన క్రీడాకారులు దేశ పతాకాన్ని గర్వంగా ఎగురవేసేందుకు వీలుగా వారికి అవసరమైన వసతులు, ప్రోత్సాహాకాలు కల్పించేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్రీడా విధానాన్ని (స్పోర్ట్స్ పాలసీ) రూపొందించింది. ప్రముఖ క్రీడాకారుల సమక్షంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలంగాణ…
Suicide : హైదరాబాద్ నగరంలోని కేపిహెచ్బీ కాలనీలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే 9వ తరగతి విద్యార్థిని లాస్య ప్రియ (13) బాత్రూం కిటికీ నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే, మంజీరా ట్రినిటీ హోమ్స్‌లో 17వ అంతస్తులో నివాసముండే హరినారాయణమూర్తి కుటుంబానికి చెందిన లాస్య ప్రియ, అడ్డగుట్టలోని నారాయణ స్కూల్లో చదువుతోంది. సోమవారం జరిగిన పేరెంట్-టీచర్ మీటింగ్‌లో విద్యాభ్యాసంపై తగిన శ్రద్ధ చూపడంలేదని టీచర్లు తల్లిదండ్రులకు సూచించారు. దీని తర్వాత ఆమె…
బంజారా హిల్స్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. పబ్ లో ఎంజాయ్ చేద్దాం రమ్మని పిలిచి.. ఓ యువకుడిని కిడ్నాప్ చేసింది ఓ మహిళ. భర్తతో కలిసి కిడ్నాప్ కు పాల్పడింది. మద్యం మత్తులో ఉన్న యువకుడి నగ్న వీడియోలు తీసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. ఆభరణాల షాపు ఉద్యోగిపై భారీ స్కెచ్ వేశారు దంపతులు. యువకుడు హత్యకు గురయ్యాడంటూ టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరుతో సినీ ఫక్కీలో డ్రామాకు తెరలేపారు. బాధితుడు బంజారా…
ఫిలిమ్ నగర్ లోని దక్కన్ కిచెన్ కూల్చివేత పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా పై ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బీ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిలిమ్ నగర్…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు.... కాస్త రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే...త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాగా... అధికార పార్టీగా... ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమ చేయి దాటి పోనివ్వకూడదన్న పట్టుదలగా ఉంది కాంగ్రెస్. అటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో... ఈ ఎన్నికల యుద్ధంపై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.