Star Hospitals: సీనియర్ సిటిజెన్స్ కోసం స్టార్ సమ్మాన్ ప్రారంభం..
- సీనియర్ సిటిజెన్స్ కోసం స్టార్ సమ్మాన్ ప్రారంభం
- వృద్ధులకు గౌరవప్రదమైన, ఆప్యాయమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 21న జరుపుకునే ప్రపంచ సీనియర్ సిటిజెన్స్ డే సందర్భంగా, స్టార్ హాస్పిటల్స్ స్టార్ సమ్మాన్ – సీనియర్ సిటిజెన్స్ హెల్త్ ప్రివిలేజెస్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులకు గౌరవప్రదమైన, ఆప్యాయమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలు (preventive care), ప్రారంభ దశలో వ్యాధులను గుర్తించే అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read:Judge Frank Caprio: ఈ జడ్జి చాలా స్పెషల్.. ఇక లేరంటూ కుటుంబం పోస్ట్..
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ఈ సందర్భంగా స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. రమేశ్ గూడపాటి గారు మాట్లాడుతూ.. “మన సంస్కృతిలో మనం ఈరోజు ఉన్న స్థాయికి రావడానికి పెద్దలే కారణం. వారిని గౌరవించడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, అది మన కర్తవ్యమూ. స్టార్ సమ్మాన్ ద్వారా వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం, అవసరమైతే సమయానికి సరైన చికిత్స అందించడం, అలాగే ప్రత్యేక రాయితీల ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించడం మా ఉద్దేశ్యం. వృద్ధుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో రూపొందించాం.” అన్నారు.
స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ సీఈఓ డా. రాహుల్ మెడక్కర్ గారు మాట్లాడుతూ..”స్టార్ హాస్పిటల్స్ ప్రత్యేకత – కుటుంబ విలువల ఆధారంగా పనిచేయడం. మా సీనియర్ సిటిజెన్స్ అనేవారు రోగులు మాత్రమే కాదు, వారు తల్లిదండ్రులు, మార్గదర్శకులు, ప్రేరణల మూలం. స్టార్ సమ్మాన్ ద్వారా ప్రత్యేక హెల్ప్‌డెస్క్, హెల్ప్‌లైన్, రాయితీలు మాత్రమే కాకుండా, వృద్ధులను సలహాదారులుగా మా కమిటీలో భాగస్వాములను చేస్తాం. ఇంటి దగ్గరే చికిత్స కోరుకునేవారికి తక్కువ ఖర్చుతో హోమ్ కేర్ సదుపాయాలు కూడా అందిస్తాం. మా లక్ష్యం – వృద్ధులు గౌరవం పొందేలా, ఆప్యాయతతో చూసుకునేలా, ఆసుపత్రి సేవల్లో భాగస్వాములు కావాలన్న భావన కలిగేలా చూడడం.” అన్నారు.
Also Read:Nara Rohith : టీడీపీ అధికారంలో ఉంటేనే సినిమాలు.. నారా రోహిత్ క్లారిటీ
హైదరాబాద్‌లో అగ్రగామి మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిగా నిలిచిన స్టార్ హాస్పిటల్స్, అత్యాధునిక వైద్య సాంకేతికత, నైపుణ్యం, రోగి-కేంద్రిత సేవలతో ప్రసిద్ధి చెందింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన స్టార్ హాస్పిటల్స్, ఆరోగ్యాన్ని మరింత దయతో, సమగ్రంగా, అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంది.
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!