Five Members of a Family Found Dead in Miyapur: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మక్తా మహబూబ్ పేట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాలను మియాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: Kohli-Rohit: వన్డేలకూ కోహ్లీ, రోహిత్ గుడ్‌బై చెప్పేశారా?.. అయోమయానికి గురైన అభిమానులు!
మృతులు అందరూ కర్ణాటకకు చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. మృతులను అత్త-మామ, భార్య-భర్త, రెండేళ్ల చిన్నారిగా గుర్తించారు. పసి కందును చంపేసి.. మిగతా నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55).. అల్లుడు అనిల్ (40), కూతురు కవిత (38).. అనిల్, కవితల కుమార్తె అప్పు (2) మృతి చెందారు. స్థానికంగా ఐదుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది.