Magha Amavasya: మాఘ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘమాసంలో వచ్చే బహుళ అమావాస్యలు అందరినీ భగవంతుని సన్నిధికి నడిపిస్తూ.. ముక్తిని పొందడం గురించి ఆలోచించేలా చేస్తాయి. మాఘ అమావాస్య సందర్భంగా జరిగే వార్షిక జాతర కోసం దుర్గామాత ఎటుపాయల ఆలయం ఏర్పాటు చేయబడింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం వద్ద స్నానాలకు షవర్తను ఏర్పాట్లు చేశారు.
Read also: Wedding Shoot: ఫ్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళుతుండగా విషాదం.. కారులో వున్న ఐదుగురు మృతి
స్టేషన్ ఘన్‌పూర్ డ్యామ్ నీటితో చెక్‌డ్యామ్ కూడా నిండింది. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. షామియానాలు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని అందంగా అలంకరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, నర్సాపూర్, మెదక్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను టేకుల గడ్డ వద్ద ఏర్పాటు చేశారు. కాగా.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని బొడ్మట్‌పల్లి, జహీరాబాద్, రాయిపల్లి, బీదర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నిలపడానికి నాగ్సాన్‌పల్లి వైపు ఉన్న చెలిమెల కుంట వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.రాజన్నసిరిసిల్ల జిల్లా మాఘ అమావాస్య సందర్భంగా కొనరావుపేట మండలం లోని మామిడిపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో మాఘ అమావాస్య జాతర నెలకొంది. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు భక్తులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల లో ప్రతాపరుద్ర లక్ష్మి నరసింహ సింగరాయ జాతర ప్రారంభమైంది. మాఘ అమావాస్యన ఒకే రోజు జరుగనున్న జాతర, వేల సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకొనున్నారు.
Fire Accident Medak: మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆహుతైన షాపులు