A twist in the case of missing woman in Osmania Police Station: ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్ బయటపడింది. ఈనెల 5వ తేదీన చంద్రకళ అనే మహిళ కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు పోలీసులు ఆశ్రయించారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే కొందరు ఈనెల 16న స్థానికులు మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహం చంద్రకళగా గుర్తించారు మల్కాజిగిరి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరు వ్యక్తులు కలిసి మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు మల్కాజిగిరి పోలీసులు నిర్ధారించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బనావత్ రాజు, సయీద్ గౌస్ లను నిందితులుగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో మహిళపై లైంగిక దాడి చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
Read also: Woman Died Violently: ఓయూలో ఆత్మహత్య కలకలం.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యువతి
అయితే మృతురాలు చంద్రకళ మౌలాలి రైల్వే స్టేషన్ సమీపానికి ఎందుకు వెళ్లింది? ఆమెను ఎవరైనా అక్కడకు రమ్మని పిలవడంతో చంద్రకళ మౌలాలి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లిందా? లేక మౌలాలి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లిన చంద్రకళను చూసి మద్యం మత్తులో ఉన్న బనావత్ రాజు, సయీద్ గౌస్ ఆమెను గమనించి చంద్రకళపై అత్యాచారానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే చంద్రకళ మరణంతో.. కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడే వస్తా అంటూ బయటకు వెళ్లిన చంద్రకళ సవమై కనింపించడంతో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?