Che Guevara Daughter: విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డా.అలైదా గువేరా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్టే ఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అలైదా గువేరా, ఆమె కుమార్తె ఎస్తెఫానియా గువేరా ఈ ఉదయం కోల్‌కతా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న వారికి అధికారులు, వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్లారు. అనంతరం అలైదా గువేరా మాట్లాడుతూ.. నాన్నతో అనుభవం మెరుపు లాంటి అనుభూతి అని చెప్పుకొచ్చారు ఆమె. క్యూబా లో పేదోళ్ల లాగా బతుకుతం.. కానీ దనికుల లెక్క చనిపోతామన్నారు.ఎందుకు అంటే అన్నీ వసతులు కల్పిస్తారు.
Read also: Harish Rao: సీఎస్‌ఎస్ నిధులు ఇప్పించండి.. కేంద్ర మంత్రికి హరీష్ రావు లేఖ
క్యూబాలో మహిళా ఫెడరేషన్ వుంటుందని తెలిపారు. మహిళలకు అన్నిరకాల మోటివేషన్ ఉంటుందని, సమాన పని.. సమాన వేతనం ఉంటుందన్నారు. ఆడ.. మగ అనే వ్యత్యాసం ఉండదు.. సమాన అవకాశాలు కల్పిస్తామని అలైదా అన్నారు. నాన్నతో తక్కువ సమయం ఉన్న ఆమె ఆయన ఒక గొరిల్లా నాయకుడు తెలిపారు. లీడర్ మిగిలిన వారిని ముందుకు తీసుకు వెళ్లేలా ఉండాలన్నారు. 24 గంటలు పని చేసే వారు మా నాన్న.. సామాజిక సేవలో నాన్న ముందుటారని తెలిపారు. ఉదయం 5 గంటలకు నన్ను నిద్ర లేపి చెరుకు కోయడానికి తీసుకువెళ్లి వాడన్నారు. చెరుకు కోయడానికి వెళ్లి.. నాన్న వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు అనేది వినే వాళ్ళం అలైదా గువేరా తెలిపారు. నాన్నతో అనుభవం మెరుపు లాంటి అనుభూతి అని చెప్పుకొచ్చారు. అమ్మ అద్భుతమైన మనిషి..మా అమ్మ పేరు కూడా నా పేరే అంటూ గుర్తుచేసుకున్నారు. నాన్న ప్రేమించిన వ్యక్తి పేరు కాబట్టి నాకు అమ్మ పేరు పెట్టారు నాన్న.
Read also: Thieves in Girls Hostel: గర్ల్స్ హాస్టల్ లో దొంగలు పడ్డారు.. తరువాత ఏం జరిగిందంటే..
సోషలిజం కోసం నాన్న రాసిన బుక్ నాకు చాలా ఇష్టం అన్నారు. చేగువేరా వైద్యం రెండు అంశాలపై బుక్ రాస్తున్న అన్నారు. ఈ బుక్ కోసం నాన్న రాసిన బుక్స్ అన్నీ చదవాల్సి వచ్చిందీ. బులేవియన్ గురించి రాసిన బుక్ చదవాలంటే కష్టం అనిపించింది. ఎందుకంటే చివరి పేజీ ఆయన మరణం గురించి ఉంటుంది. ఫిడెల్ క్యాస్ట్రో తో నాన్న కంటే ఎక్కువ సమయం గడిపా అన్నారు. నాకు ఆయనకు తండ్రి కూతురు బంధం. నాకు పాప పుట్టినప్పుడు విక్టోరియా అని పేరు పెట్టాలని అన్నారు. కానీ కుదరలేదని చెప్పుకొచ్చారు. మా పాపని చూపిస్తూ.. నువ్వు మీ అమ్మలాగా కాకు అని నవ్వి చెప్పారని తన తండ్రితో ఉన్న గతంలో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అలైదా. మాదగ్గర ఒకప్పుడు అక్షరాస్యత లేదు.. కానీ ఇప్పుడు అన్ని దేశాలకు వైద్యులు వెళ్తున్నరూ అంటూ తెలిపారు. అన్ని రకాలుగా మా దేశానికి మేమే అధిపతులం తెలిపారు అలైదా. చేగువేరా కంప్లీట్ కమ్యూనిస్టు.. ఇరాన్ లో కూడా ఆయన్ని ప్రేమిస్తారని చెప్పుకొచ్చారు. అవన్నీ వింటుంటే నాకు అచ్చర్యం అనిపిస్తుంది.. చేగువేరా నుండి ఏం నేర్చుకోవాలి అంటే అది నేర్చుకోవచ్చు అంటూ తెలిపారు. ఆయన ఐడియాలజీ కమ్యూనిజం.. అలాగే బతికాడు అలాగే చనిపోయాడంటూ అలైదా తెలిపారు.
Revanth Reddy: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను నిదర్శనం