Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. 70 ఏళ్లుగా మమ్మల్ని దోచేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చే శారు.. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ పార్లమెంట్‌లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు.. కానీ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఓ లీడర్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదని విమర్శించారు.. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని పార్టీల నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.. 70 ఏళ్లుగా మమ్మల్ని ఇదే విధంగా దోచుకున్నారని ఆరోపించారు.. ఈ దేశంలో అగ్రకులస్తులే రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఒవైసీ.. మైనార్టీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు ఏకితాటిపైకి రావడం రాజకీయ పార్టీలకి నచ్చదని పేర్కొన్నారు..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ఇక, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కి నా విజ్ఞప్తి.. మీరు ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి.. తల్వార్లు, కత్తులతో దాడులు చేస్తున్న వారిని ఉక్కు పాదంతో అణిచివేయండి అని విజ్ఞప్తి చేశారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. వారికి శాశ్వతంగా బెల్ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.. మరోవైపు.. భారతదేశంలో బీబీసీ కార్యక్రమాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై నిషేధించారు.. గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కదా..! గాడ్సే.. గాంధీ హంతకుడు.. అసలు గాడ్సే పైన మీ నిర్ణయం ఏంటి..? అని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. గాడ్సే పై సినిమాని చిత్రకరిస్తున్నారు.. గాంధీ హంతకుడుపై తీయబోతున్న సినిమాని మీరు భారతదేశంలో బ్యాన్ చేస్తారా? లేదా? అని నిలదీశారు.. మీ గురించి, బీజేపీ గురించి ప్రచారం చేస్తోన్న వార్తని బ్యాన్ చేస్తున్నారు.. మరి గాడ్సేపై తీయబోతున్న సినిమాని భారత దేశంలో బ్యాన్ చేస్తారా? లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!