Gold Theft: ఆభరణాలు తయారు చేయమని బంగారం ఇస్తే దానితో ఉడాయించాడు ఓ నగల తయారుదారుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడలో చోటుచేసుకుంది. నారాయణగూడలోని ఓ షాపు పెట్టుకుని నగలు తయారు చేస్తున్న గోల్డ్ స్మిత్ గణేష్ చంద్ర దాస్.. దాదాపు కోటి రూపాయల విలువ గల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు.
Viral : తాగిన ఒక్క బీరుకు.. బారెడంత బిల్లు వేసి మత్తు దించిన పోలీసులు
అసలేం జరిగిందంటే.. బషీర్‌బాగ్‌లోని శ్రీయాష్ జ్యూవెల్లర్స్ యజమాని ఆనంద్ కుమార్.. కోటి రూపాయల విలువ చేసే బంగారాన్ని ఆభరణాల తయారీకి గోల్డ్ స్మిత్ గణేష్ చంద్ర దాస్‌కు ఇచ్చాడు. ఆభరణాల తయారీ కోసం బంగారం తీసుకున్న గణేష్ చంద్ర దాస్.. తిరిగి ఇవ్వలేదు.దీంతో ఆభరణాలు తయారు చేసే గణేష్ చంద్ర దాస్ షాపుకు వెళ్లి చూడగా పరారీలో ఉన్నాడు. దీంతో బాధిత యజమాని నారాయణ గూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. నమ్మి బంగారం ఇస్తే ఇలా మోసానికి పాల్పడ్డాడని జ్యువెల్లర్స్ యజమాని ఆనంద్ కుమార్ పోలీసుల ఎదుట వాపోయారు.