Che Guevara: హైదరాబాద్ కు చేగువేరా కూతురు, మనవరాలు.. క్యూబా సంఘీభావ సభలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Che Guevara: విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డా.అలైదా గువేరా నేడు హైదరాబాద్ రానున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్టే ఫానియా గువేరా కూడా నగరానికి వస్తున్నారు. ఇవాళ (ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు అలైదా గువేరా, ఎస్టీ ఫానియా ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ, ఎంఐఎం మినహా ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చాలా దేశాలు క్యూబాకు మద్దతు ఇస్తున్నాయి. అందులో భాగంగానే క్యూబాకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సభకు చేగువేరా కూతురు, మనవరాలు వస్తున్నారు. వీరికి నాయకులు ఘనస్వాగతం పలకనున్నారు. క్యూబా సంఘీభావ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్ కుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని, తమ్మినేని, మాజీ ఎంపీ మల్లు రవి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల సభ్యులు పాల్గొంటారు.
Read also: Women IAS: అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్.. కారణం ఇదీ..
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఈ సభను విజయవంతం చేయాలని క్యూబా తెలంగాణ కమిటీ కోఆర్డినేటర్లు బాలమల్లేష్, నరసింహారావులతో జాతీయ సంఘీభావ కమిటీ పిలుపునిచ్చారు. గురువారం మగ్ధుం భవన్‌లో ‘క్యూబా సంఘీభావ సభ’ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలని, చేగువేరా కుమార్తె, మనవరాలికి ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అలైదా, ఎస్తెఫానియా సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దుంభవన్‌కు వెళ్లనున్నారు. వీరి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సభ జరిగే రవీంద్రభారతి వద్ద పలుచోట్ల ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి. చేగువేరా ఫ్లెక్సీలతో పాటు ఆయన కూతురు, మనవరాలికి స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Telangana Congress: మూడోరోజు థాక్రే పర్యటన.. ఇవాళ్టి షెడ్యూల్ ఇదే..
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!