చిన్నాచితక మహిళా వ్యాపారులే అతని టార్గెట్ !! ముద్ర లోన్స్ పేరుతో పరిచయం చేసుకుని.. మాయమాటలు చెప్పి.. నిండా ముంచుతున్నాడు. ఇలా మోసం చేసింది ఏ 10 మందినో.. వంద మందినో కాదు. ఏకంగా 500 మందిని మోసం చేశాడు. లక్షలు దండుకుని ఆస్తులు కూడగట్టుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. ఐదేళ్ల తర్వాత కానీ పోలీసులకు పట్టుబడలేదు. రోజుకో ప్రాంతంలో మారు వేషాల్లో తిరుగుతున్న ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. అమాయకంగా చేతులు కట్టుకుని నిల్చున్న…
ఆప్యాయతలు.. అనురాగాలు అన్నీ కనుమరుగైపోతున్నాయి. కేవలం పగలు, ప్రతీకారాలు, కుటుంబ కలహాలతో రగిలిపోతూ… చివరకు హత్య చేసే వరకు కూడా వెను కాడడం లేదు. నేటి సమాజంలో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. సొంత బామ్మర్దులే బావను తీసుకువెళ్లి హత్య చేశారు. హైదరాబాద్‌లో ఓల్డ్ మలక్‌పేట్‌లో జరిగిన హత్య కలకలం రేపుతోంది. ఇక్కడ చూడండి..ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహ్మద్ సిరాజ్. యాకుత్‌పురాలో నివాసం ఉంటున్నాడు. రాత్రి…
Telangana : తెలంగాణ ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్మెంట్ (I&CAD) శాఖలో ఎనిమిది మంది సూపరింటెండింగ్ ఇంజనీర్లను చీఫ్ ఇంజనీర్లుగా పదోన్నతి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 05-08-2025 తేదీతో అమల్లోకి వచ్చిన ఈ ఉత్తర్వులు తాత్కాలికం , అధోక్ ప్రాతిపదికన మంజూరు చేయబడ్డాయి. National Jury : పృథ్వీరాజ్ సుకుమారన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎందుకు ఇవ్వలేదంటే ఈ ఉత్తర్వుల ప్రకారం ఏ. సత్యనారాయణ రెడ్డి మహబూబ్‌నగర్ చీఫ్ ఇంజనీర్‌గా,…
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా…
KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ యాగాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా నిర్వహించనున్నారు. ఈరోజు యాగం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ చండీ యాగం మూడు రోజుల పాటు కొనసాగనుంది. రేపటి నుంచి అధికారికంగా యాగం ప్రారంభమవుతుంది. Pulaparthi Nani: లిక్కర్…
తెలుగు రాష్ట్రాల్లో కొంత కాలంగా చైన్ స్నాచర్ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు వేసుకొని బైక్‌పై వచ్చి.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలోంచి బంగారంను ఎత్తుకెలుతున్నారు. మహిళల మెడల్లో నుంచి పుస్తెలు తాడు లేదా చైన్స్ లాక్కెళ్లిన ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్తరకం చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. Also Read: IND vs ENG: రసవత్తర ముగింపు దిశగా ఐదో టెస్ట్.. భారత్‌కు 4 వికెట్లు,…
ఎవరైనా దొంగలు ఇళ్లు దోచుకుంటారు.. ఏటీఎంలపై కన్నేస్తారు.. లేదంటే జ్యువెల్లరీ దుకాణాలపై నిఘా పెడతారు. హైదరాబాద్‌లో కొంత మంది దుండగులు వెరైటీ చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల్లో దుండగులు చేసిన చోరీ చూసి జనం అవాక్కవుతున్నారు. మోండా మార్కెట్లో జరిగిన ఈ దొంగతనం ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతోంది. ఇంతకీ ఆ దొంగలు ఏం చేశారు?. ఆవును దొంగతనం చేసిన ఘటన సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అర్థరాత్రి…
ఖరీదైన కార్లలో వస్తారు.. అక్కడే గంటల తరబడి తిష్ట వేస్తారు.. కబుర్లు చెప్పుకొని వెళ్లిపోతున్నారేమో..? లేదా మందు ఏమైనా తాగుతున్నారా? ఓ దమ్ము లాంగిచి వెళ్తున్నారేమో.. అనుకుంటే పొరపాటే.. ఎందుకుంటే.. ఇంతకీ వాళ్లు ఏం చేస్తున్నారంటూ ఫోకస్ పెట్టిన పోలీసులు.. అసలు విషయం చూసి షాక్ తిన్నారు...
HYDRA : హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బోరబండ, గచ్చిబౌలి, వనస్థలిపురం, బడంగిపేట తదితర ప్రాంతాల్లో నాళాలు, చెరువుల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు, సూచనలు చేసిన ఆయన… అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బోరబండ హైటెన్షన్ రోడ్ విస్తరణ పనులపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. నాలాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, మురుగు నీరు వరద నీటిలో కలిసిపోకుండా కిందకి పోవేలా…
దేశ క్రీడా రంగానికి దిక్సూచిగా… ఒలింపిక్స్ పతకాల వేటకు ఆట మైదానంగా…. భావి క్రీడాకారులకు మార్గదర్శిగా… ఘనమైన గత వారసత్వపు పరిమళాలను మరింతగా వ్యాపింపజేసేందుకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. ప్రతి క్రీడాకారునిలో ప్రతిభకు మరింతగా సానబెట్టి విశ్వ వేదికపై మన క్రీడాకారులు దేశ పతాకాన్ని గర్వంగా ఎగురవేసేందుకు వీలుగా వారికి అవసరమైన వసతులు, ప్రోత్సాహాకాలు కల్పించేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్రీడా విధానాన్ని (స్పోర్ట్స్ పాలసీ) రూపొందించింది. ప్రముఖ క్రీడాకారుల సమక్షంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలంగాణ…