ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. రెండు గంటలు ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభం కావడంతో వేగంగా ముందుకు సాగుతోన్న బడా గణపతి.. వడివడిగా పోలీసులు కదిలిస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ రూట్ లో గణేష్ లను దారి మళ్లిస్తున్నారు. వినాయకులన్నిటినీ ట్యాంక్ బండ్ వైపు దారి మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర ప్రారంభం కావడంతో రోడ్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సచివాలయం వద్ద గణేష్ క్యూ లైన్ చూస్తుంటే… ఈసారి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మరింత ఆలస్యం అయ్యేలా ఉందంటున్నారు.. రాత్రి నుంచి మండపాల నుంచి కదిలించిన బారి గణేష్ లు వినాయక్ సాగర్ వైపుకి బారులు తీరాయి..