గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్–2, 3 ప్రాజెక్ట్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నేడు గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2,3 ప్రాజెక్టు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి నగరానికి 20 టీఎంసీల నీరు తరలించనున్నారు. అందులో 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరో రెండున్నర టీఎంసీలు మూసీ ప్రక్షాళన & జంట జలాశయాల పునరుజ్జీవనానికి వినియోగించనున్నారు.
Also Read:CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో ఫిరాయించిన ఎమ్మెల్యేల భేటీ.. కడియం శ్రీహరి గైర్హాజరు
ప్రస్తుతం నగరానికి వివిధ ప్రాజెక్టుల ద్వారా 580 నుంచి 600 ఎంజీడీల నీటి సప్లై చేపడుతున్నారు. భవిష్యత్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని మల్లన్నసాగర్ నుంచి మరో 300 ఎంజీడీల నీటిని నగరానికి తరలించేందుకు ప్రణాళికలు చేపట్టారు. ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేసిన వాప్‌కోస్ కంపెనీ.. ఘన్‌పూర్, శామీర్‌పేట్ వద్ద 1,170 ఎంఎల్డీల సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయనున్నారు. ఘన్‌పూర్ నుంచి ముత్తంగి వరకు భారీ పైప్‌లైన్, పంప్ హౌజ్‌లు, సబ్‌స్టేషన్లు నిర్మాణం చేయనున్నారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి 300 ఎంజీడీల నీటి సరఫరా లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.