హైదరాబాద్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్టులకు రేటింగ్ ఇస్తామని చెప్పి మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నుంచి సుమారు కోటి యాబై లక్షల రూపాయలను దుండగులు వసూలు స్వాహా చేశారు.
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాల్లో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఈసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి.
Off The Record: ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల యుద్ధం కోసం తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ కత్తులు నూరుకుంటున్నాయి. జనంలోకి వెళ్లేందుకు రకరకాల మార్గాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ క్రమంలోనే అధికార BRS కూడా సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా నజర్ పెట్టిందట. పార్టీ తరపున ఇప్పటికే సోషల్ మీడియా వింగ్ యాక్టివ్గానే ఉన్నా… ఇక నుంచి ఆ డోస్ పెరగబోతున్నట్టు తెలిసింది. ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే…సోషల్ మీడియాలో తమ ప్రజెన్స్ ఎక్కువగానే…
Bhatti Vikramarka Exclusive Interview: ధరణిలో అనేక భూములను ఎంట్రీ చేయలేదని చేయడం లేదు అని ఆరోపించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. తాను చేపట్టిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పేదలు అనుభవిస్తోన్న భూములను కూడా భూస్వాముల భూములుగా చూపిస్తోంది ధరణి అని విమర్శించారు. ఇక, గతంలో దున్నేవాడికి భూమి కావాలంటూ అనేక పోరాటు జరిగాయి.. అలా హక్కులు సంపాదించుకున్న తర్వాత.. ఇప్పుడు ధరణిని తీసుకొచ్చి..…
భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్, ఉమెన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ అయిన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్.. జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ అప్రూవల్'ని పొందినట్లు వెల్లడించింది.
చెంగిచెర్ల చౌరస్తాలో విద్యార్ధులతో కలిసి చిందులేస్తూ మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. విజేతలకు ఇచ్చే ట్రోఫీ పట్టుకుని డ్యాన్సులేశారు. అలాగే విద్యార్ధులు స్టేజీపై డ్యాన్సులు వేస్తుండగా.. వారిని మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం ఆయన చేశారు. అనంతరం అక్కడకు వచ్చిన మహిళా కళాకారులతో కలిసి బతుకమ్మ పాటలకు మల్లారెడ్డి ఆడిపాడారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్‌ను ఘనంగా జరిగింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా ఈ రన్ కొనసాగింది.
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీస్థాయిలో పోలీసుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని, సొంత ప్రాంతాలకు ఎవరినీ బదిలీ చేయవద్దని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
అప్సర కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్సరను చూసి చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..