తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. సికింద్రాబాద్కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు తొలిసారిగా తెలుగులో తీర్పు వెల్లడించింది.
హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ నాలా ప్రక్కన పడిఉన్న అమ్మోనియం గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. అయితే, గ్యాస్ పీల్చిన 10 మందికి అస్వస్థతకు గురి కావడంతో వారిని బీబీఆర్ హాస్పటల్ కు తరలించారు. ఈ ప్రమాంలో ఐదుగురు స్వల్ప అస్వస్థతకు గురైన వారిని చికిత్స అనంతరం డిచార్చ్ చేశారు.
పెళ్లి అంటే మనిషి జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక.. అందుకే ఉన్నంతలో చేసుకుంటున్నారు… ఇప్పుడు కూడా ఓ జంట అలానే పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాతే పెళ్లి కొడుక్కి అసలు ట్విస్ట్ ఎదురైంది..అయితే ఆ జంట కూడా పెళ్లిని ఘనంగా చేసుకుంది. ఆపై వధువు ఇంటి నుంచి వరుడి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వరుడి ఇంటికి చేరుకున్న తర్వాతి రోజు వధువు కడుపు నొప్పి వస్తుందని చెప్పింది. దీంతో ఆస్పత్రికి తరలించారు.…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై గతంలో ఆరోపణలు చేసిన షేజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ఆదినారాయణ రావు షేజల్ ను పెద్దమ్మతల్లి గుడి వద్ద వదిలివెళ్లాడు. ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శేజల్.. ఇవాళ మరోసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే తన దగ్గర సరైన ఆధారాలు లేవు అన్న మాటలకి షేజల్ మనస్థాపం చెంది.. నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది.
కాసేపట్లో గుర్రంగూడ నుంచి సాయిచంద్ అంతిమయాత్ర స్టార్ట్ కానుంది. కాగా ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ గుర్రంగూడలోని సాయింద్ నివాసానికి కాసేపట్లో వెళ్లనున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు.
అధ్యాత్మిక భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళుతూ స్పెషల్ ప్యాకేజీలను ఇస్తు్న్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ సారి హైదరాబాద్ టు ఉజ్జయిని టూర్ను ఏర్పాటు చేశారు.
పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోన్న కేటుగాడ్ని మాల్కాజగిరి పోలీసులు నిన్న (బుధవారం) అరెస్ట్ చేసినట్లు మల్కాజగిరి ఇన్స్పెక్టర్ రాములు వెల్లడించారు.
హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. మింట్ కాంపౌండ్ లో రామయ్య హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం SLR గన్ మిస్ ఫైర్ అయి.. ఛాతి లోకి బులెట్ దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే హెడ్ కానిస్టేబుల్ రామయ్య కుప్పకూలాడు.
తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సీఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.