TSRTC: టీ-9 టికెట్ తెచ్చిన ఆర్టీసీ.. ఇప్పటి నుంచి ఆ బస్సులో కూడా వర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘టీ-9 టికెట్’ సమయాల్లో TSRTC మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా ఈ టికెట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని తెలిపింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. అయితే.. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
Read Also: Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. మనీష్ సిసోడియా, ఇతరుల ఆస్తులు స్వాధీనం
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
టీ-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబీనేషన్ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ జర్నీ చేసే వెసులుబాటు కల్పించింది. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్ వర్తిస్తుందని ప్రకటించింది. టీ-9 టికెట్ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది.
Read Also: Baby Trailer: అబ్బాయిలను గుండెల మీద కొట్టాలంటే.. అమ్మాయిల కంటే గట్టిగా ఎవ్వరు కొట్టలేరు
పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టీ-9 టికెట్‌ను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ టీకెట్ ద్వారా రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చని తెలిపింది. జూన్ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే 11 వేల మంది ప్రయాణికులు ఈ టికెట్‌ను కొనుగోలు చేశారు. టీ-9 టికెట్ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకు రావడంతో వారి అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని టీఎస్ఆర్టీసీ పెంచింది.
Read Also: Ratan Tata: వానాకాలంలో డ్రైవింగ్ చేసేవారు జర దీని గురించి తెలుసుకోండి..
అయితే.. తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబీనెషన్ టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్ సిటిజన్స్ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి అని టీఎస్ఆర్టీసీ తెలిపింది. సంస్థను ఆదరించాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను టీఎస్ఆర్టీసీ ఇప్పటికే అందిస్తోండగా.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టికెట్ ను ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తెచ్చిందని వారు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!