Hyderabad : దారుణం.. చిన్నారి ముక్కును తీసేసిన డాక్టర్లు..ఆసుపత్రి బయట బంధువుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో దారుణం వెలుగు చూసింది.. లేక లేక ఎన్నో ఏళ్లకు పుట్టిన బిడ్డకు ఇన్ఫెక్షన్ పేరుతో ముక్కు లేకుండా చెయ్యడం పై తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. డాక్టర్లు చేసిన పనికి తల్లి దండ్రులు, బంధువులు ఆసుపత్రి బయట ఆందోళనకు దిగారు..వైద్యులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన సిబ్బంది చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో శుక్రవారం నాడు కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన హైదరాబాదులోని నారాయణగూడలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే..పాతబస్తీ కాలా పత్తర్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్, హర్షన్నుస్సా ఖాన్ దంపతులు. వీరికి 13 ఏళ్ల క్రింద వివాహమైంది. కానీ సంతానం కలగలేదు. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. 13యేళ్ల తరువాత ఇటీవల హర్షన్నుసా గర్భం దాల్చింది. జూన్ 8వ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది హర్షన్నుస్సా ఖాన్. దీనికోసం హైదర్గూడా లోని ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో చేరారు. పుట్టిన బిడ్డకు ఫతే ఖాన్ అనే పేరును కూడా పెట్టుకున్నారు.. పుట్టిన వెంటనే శిశువు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని గమనించిన వైద్యులు వెంటనే ఐసీయూలోకి మార్చారు.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
అప్పటి నుంచి శిశువు ఎన్ఐసియూ లోనే ఉంది. ఆ తర్వాత పది రోజులకు తల్లిదండ్రులకు వైద్యులు బిడ్డను చూపించారు. ఆ సమయంలో బిడ్డ ముక్కు నల్లగా ఉంది. అదే విషయాన్ని తల్లిదండ్రులు వైద్యుల్ని ప్రశ్నించారు.. అయితే ఆక్సిజన్ పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం వల్ల అలా ఉందని చెప్పారు..మళ్లీ ఎన్ఐసియూలో పెట్టారు. మరోసారి బిడ్డను చూపించిన సమయంలో.. మొదట చూపించినప్పుడు ఉన్న నల్లటి భాగం ఊడిపోయి ఉంది. దీంతో ఏం జరిగిందంటూ వైద్యులను ప్రశ్నించారు. దీనికి వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తండ్రి వాపోయాడు. ఆస్పత్రి బిల్లు రోజుకు రూ. 35000 చొప్పున వసూలు చేస్తున్నారని ఇప్పటివరకు తాము రూ. 5 లక్షల వరకు బిల్లు కట్టామని.. ఇప్పుడు బాబుకు ముక్కు లేకుండా చెయ్యడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..