హైదరాబాద్ నగరంలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది. ఇక, ఈ మీటింగ్ లో బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు జేపీ నడ్డా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మీటింగ్ లో దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎజెండాను రూపొందించాలని ఈ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించారు.
Read Also: Tamilnadu: గవర్నర్ తొలగించబడడానికి అర్హులు.. రాష్ట్రపతికి తమిళనాడు సీఎం లేఖ
ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలకు జేపీ నడ్డా సూచించారు. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ దక్షిణాదిన బలోపేతం కాకపోవడానికి కారణాలపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించారు. ఈ సందర్భంగానే పలు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరుపై నడ్డా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పని తీరు అద్భుతం ఉందని ఆయనను నడ్డా ప్రశంసించాడు. పార్టీని పటిష్ట పరిచి బూత్ కమిటీలు పూర్తి చేయాలని నేతలకు జేపీ నడ్డా ఆదేశించాడు. దక్షిణ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ మీటింగ్ లో బీజేపీ 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Also: Beard: గడ్డం పెరగాలంటే ఇలా చేయండి..!
ఈ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రబాద్ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళీ అమ్మవారికి నడ్డా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అక్కడ నుంచి శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. అయితే ఇప్పటికే నోవాటెల్ హోటల్ కు తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు చేరుకుంటన్నారు. బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, విజయశాంతి, వివేక్ వెంటకస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీబీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలు డీకే అరుణ, తరుణ్ చుగ్ చేరుకున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నికల స్ట్రాటజీ, నాయకుల మధ్య సమనవ్యయంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత ఇది మొదటి సమావేశం.