అసాంఘిక కార్యాకలాపాలకు శ్మశాన వాటికను అడ్డాగా మార్చుకుంది ఓ మహిళ. శ్మశానంలోని గదిలో వ్యభిచార దందా నడుపుతోంది. గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తోంది. శ్మశానంలో అయితే ఎవరికీ అనుమానం కలుగదని భావించింది. కానీ తప్పు చేసిన వాళ్లు ఏదో ఒక రోజు పట్టుబడాల్సిందే కదా.. ఈ క్రమంలో విషయం తెలిసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి తనఖీలు చేసి గుట్టురట్టు చేశారు. ఈ ఘటన పంజాగుట్టలో చోటుచేసుకుంది. పంజాగుట్ట పరిధిలోని శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చింది ఓ మహిళ.
Also Read:PM Modi: 2 ఏళ్ల తర్వాత తొలిసారి మణిపూర్‌లో అడుగుపెట్టిన మోడీ
శ్యాం లాల్ బిల్డింగ్స్ సమీపంలో ఉన్న శ్మశాన వాటిక లో ఉన్న రూమ్ ను వ్యభిచార గృహం గా మార్చింది. నిర్వాహకురాలు మాధవి యువతులను తీసుకువచ్చి విటులను ఆహ్వానించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాధవితో పాటు.. ఓ యువతి, విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విటుడిగా వచ్చిన వ్యక్తిని ఓ సివిల్ కాంట్రాక్టర్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది తెలిసిన వారు శ్మశానాన్ని కూడా వదలరేంట్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.