హైదరాబాద్‌లో భారీ మొత్తంలో నోట్లు పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద మరో ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురి వద్ద ఉన్న 3 బ్యాగుల్లోని రూ.2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ నోట్లు అన్ని రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు. Also Read: Crime News: అంబర్ పేట్లో దారుణం.. భార్యపై కన్నేశాడని స్నేహితుడిని..!…
అల్లు అరవింద్ తన తల్లి అల్లు కనకరత్నం మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు అల్లు కనకరత్నం దశదిన కర్మను హైదరాబాద్‌లో నిర్వహించారు. అల్లు అరవింద్ దుఃఖంలో ఉండగా, ఆయనను పరామర్శించేందుకు సినీ పెద్దలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే విధంగా, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సైతం అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి సంతాపం వ్యక్తం చేశారు. Also Read:Malayalam Actresses: టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న మల్లు భామలు?…
హైదరాబాద్‌లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు SHREE TMT హైదరాబాద్ రన్ – మైండ్ ఓవర్ మైల్స్ పేరుతో 10K & 5K రన్ నవంబర్ 9న గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన అంశం. అయినప్పటికీ మన సమాజంలో ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇంకా వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు, Orange Hub Events ఆధ్వర్యంలో SHREE TMT టైటిల్ స్పాన్సర్‌గా Mind Over Miles –…
మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్షత చూపిస్తుందన్నారు. ఎరువుల తయారీ, సరఫరా భాద్యత కేంద్రానిదే.. ఉద్దేశ పూర్వకముగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఓపెన్ చేయట్లేదు.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా పట్టించుకోట్లేదు.. మీకు చేతనైతే కేంద్రం మెడలు వంచి ఎరువులు తెండి.. రైతులు ఉద్యమించే వరకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.. Also Read:Horrific Incident in Visakha: విశాఖలో…
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్–2, 3 ప్రాజెక్ట్ పనులకు సీఎం రేవంత్ రెడ్డి నేడు గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్-2,3 ప్రాజెక్టు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి నగరానికి 20 టీఎంసీల నీరు తరలించనున్నారు. అందులో 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరో రెండున్నర టీఎంసీలు మూసీ ప్రక్షాళన & జంట జలాశయాల పునరుజ్జీవనానికి వినియోగించనున్నారు. Also Read:CM Revanth…
తల్లి మరణం మరువకముందే అల్లు అరవింద్‌ను మరో విషాదం వెంటాడింది. ఆయన సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడైన సి. నాగరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. చిన్ననాటి నుంచి అల్లు అరవింద్ స్నేహితుడైన నాగరాజు, అల్లు అరవింద్‌తో కలిసి ఉండాలని హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ‘మాస్టర్’ సినిమా నుంచి ఆయన గీతా ఆర్ట్స్ నిర్మించిన ఎన్నో సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. Also Read : Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు…
Ganesh Immersion: హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా రెండో రోజు కూడా భారీగా శోభయాత్రలు జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు హృదయపూర్వకంగా గణేశుని పరాయణం చేస్తూ శోభయాత్రను జరుపుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ వైపు లోయర్ ట్యాంక్ బండ్ నుంచి బషీర్ బాగ్ వరకు అనేక గణేష్ విగ్రహాలు బారులు తీరాయి. మరోవైపు పాత బస్తీ ప్రాంతం నుంచి మార్కెట్ దాకా వేలాది మంది భక్తులు పాల్గొని గణేశుని శోభాయాత్రను…
దుండిగల్ చెరువులో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని హైడ్రా DRF సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. కుటుంబ కలహాలతో మానసిక ఆవేదనకు గురైన రహీం అనే వ్యక్తి చెరువులో దూకి తన ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు.
హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. దారులన్నీ గణపయ్య విగ్రహాలతో హుస్సేన్ సాగర్ వైపు పయనమయ్యాయి. గణపయ్య భక్తులు ఆటపాటలతో శోభాయాత్రాలో పాల్గొంటున్నారు. గణేష్ నిమజ్జనం వేళ నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. నగరంలో అత్యంత విశిష్టత కలిగిన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఈ ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొనగా బడా గణేషుడు హుస్సేన్ సాగర్ కు తరలివెళ్లాడు. Also Read:KantaraChapter1: కాంతారా -1 మలయాళ…
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. నిన్న శ్రీశైలం వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు ప్రవీణ్ సూద్. జూబ్లీహిల్స్ లోని సిబిఐ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సీబీఐ గెస్ట్ హౌస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.