భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బండారు దత్తాత్రయ తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. సురవరం భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సురవరం సుధాకర్‌రెడ్డి.. నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడిన నాయకుడు అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సంతాపం తెలిపారు.
Congress PAC- TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ అడ్వజరీ కమిటీ ఈరోజు ( ఆగస్టు 23న) సాయంత్రం 5 గంటలకి కీలక సమావేశం కానున్నాయి.
ఆగస్టు 21న జరుపుకునే ప్రపంచ సీనియర్ సిటిజెన్స్ డే సందర్భంగా, స్టార్ హాస్పిటల్స్ స్టార్ సమ్మాన్ – సీనియర్ సిటిజెన్స్ హెల్త్ ప్రివిలేజెస్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులకు గౌరవప్రదమైన, ఆప్యాయమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలు (preventive care), ప్రారంభ దశలో వ్యాధులను గుర్తించే అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. Also Read:Judge Frank Caprio: ఈ జడ్జి చాలా స్పెషల్.. ఇక…
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. సెక్యూరిటీ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ విధులు నిర్వర్తించనున్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను బలోపేతం చేయడానికి వంద మంది మార్షల్స్లకు 50 బైక్‌లను సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్లో భాగంగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడంతో పాటు వాహనాలు సజావుగా, సాఫీగా వెళ్లేందుకు ట్రాఫిక్ పెట్రోలింగ్ బైకులు సహకరించనున్నాయి. పబ్లిక్ ప్రైవేట్…
Five Members of a Family Found Dead in Miyapur: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మక్తా మహబూబ్ పేట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాలను మియాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. Also Read: Kohli-Rohit: వన్డేలకూ కోహ్లీ, రోహిత్ గుడ్‌బై చెప్పేశారా?.. అయోమయానికి గురైన అభిమానులు!…
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత 15 రోజుల్లో టమాటా ధర డబుల్ అయిపోయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా 60 నుంచి 70 రూపాయలు పలుకుతుంది.
హైదరాబాద్ మహానగరంలో పండగ వేళ విషాదం వరుసగా దాడి చేస్తోంది. గత రెండు రోజుల్లోనే కరెంట్ షాక్‌ల కారణంగా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతాపూర్ గోఖుల్‌నగర్‌లో నిర్వహించిన రథోత్సవం సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు.
తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధర్మ మహేష్ కాకాని అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. మహేష్, అతని కుటుంబం మీద మహేష్ భార్య వరకట్నం కేసు ఫైల్ చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. నిజానికి గతంలో కూడా అదనపు కట్నం కేసులో ధర్మ మహేష్ కొన్ని రోజులపాటు కౌన్సెలింగ్‌కి కూడా వెళ్లొచ్చారు.…
Honey Trap: హైదరాబాద్‌లో మరోసారి ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసం జరిగింది. హింజ్ (Hinge) అనే డేటింగ్ యాప్‌లో శివాని పేరుతో ఓ యువతితో పరిచయం పెంచుకున్న ఒక యువకుడు సైబర్ నేరగాళ్లకు బలయ్యాడు. అమ్మాయి పూణే నుంచి హైదరాబాద్‌కు వచ్చానని, మూడు రోజుల పాటు నగరంలో ఉంటానని చెప్పి బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత తరచూ వీడియో కాల్ చేస్తూ అతడి ఫోటోలను సేకరించింది. ఆపై వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి అందరికీ షేర్…