రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ మహిళ కేసుని పోలీసులు చేధించారు. యాకుత్ పూరా కు చెందిన మహిళను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్లు డిపో వద్ద సోయి లేకుండా పడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. టౌలీ చౌకీ కి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ హైదర్ గూడ వద్ద మద్యం మత్తులో పడి ఉన్న మహిళను బలవంతంగా ఆటో లో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ బ్రిడ్జ్ కిందకు తీసుకువచ్చి ఫుల్ గా మద్యం సేవించారని తెలిపారు. ఆ తర్వాత మత్తులో ఉన్న మహిళ పై ఒకరి తరువాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. తమకు సరయైన రీతిలో సహరించడం లేదంటూ విచక్షణ కోల్పోయి మృగాలుగా ప్రవర్తించారు కామాందులు.
Also Read:CM Chandrababu: ఐటీ గురించి కాదు.. రైతుల కోసమే ఎక్కువగా ఆలోచిస్తా!
మహిళను పూర్తిగా వివస్త్రను చేసి దిగంబరంగా మార్చి చేసి అత్యంత క్రూరంగా హత్య చేశారు ఆటో డ్రైవర్స్. ఆ తర్వాత మహిళ మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఐదు రోజులు శ్రమించి హంతకులను పట్టుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. నాంపల్లి నుండి రాజేంద్రనగర్ ,హైదర్ గూడా వరకు ఉన్న అన్ని సిసి టీవి లను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం మద్యాహ్నం సమయంలో యాకత్ పూరా నుండి హైదర్ గూడా కు వివాహిత వచ్చినట్లు తెలిపారు. \
మహిళ హైదర్ గూడా కల్లు కంపౌండ్ లో ఫుల్ గా కల్లు సేవించిందని తెలిపారు. కాంపౌండ్ వద్ద మత్తులో బయటకు వచ్చి రోడ్డు పై పడి పోయినట్లు తెలిపారు. అదే సమయంలో టౌలీచౌకికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ కల్లు కంపౌండ్ కు వచ్చారని అన్నారు. మహిళ కదలికలు గమనించి ఆమె పై కన్ను వేశారు మానవ మృగాలు. మద్యం మత్తులో పడి ఉన్న మహిళను నిర్మాణుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్లి రేప్ అండ్ మర్డర్ కు పాల్పడినట్లు తెలిపారు.