Off The Record: జూబ్లీహిల్స్ కేంద్రంగా సమస్య..? కాంగ్రెస్ లో మరోసారి కోలాటం మొదలైందా..?
- జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశావహులు..
- పెరుగుతున్న పొలిటికల్ హీట్, గందరగోళం..
- సీరియస్ ట్రయల్స్‌లో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్..
- నియోజకవర్గం మొత్తం ఫ్లెక్సీలు, కటౌట్స్‌తో హంగామా..
- అదే స్థాయిలో ప్రయత్నిస్తున్న సీఎన్ రెడ్డి..
- పార్టీలో బీసీ వర్సెస్ రెడ్డిగా కొత్త చర్చ..
- అంతర్గత చర్చల్లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు..
- ఎవరేం చేసినా పార్టీకి ప్లస్సేకదా అన్నట్టు నాయకత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అధికార పార్టీ కావడంతో… గెలుపు ఈజీ అని లెక్కలేసుకుంటూ… ఎవరికి వారు రేస్‌లోకి దూసుకొస్తున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం డివిజన్స్ వారీగా పని మొదలుపెట్టింది. ఈ గ్రౌండ్ వర్క్ చూస్తున్న చాలామంది ఆశావహుల పొలాల్లో మొలకలొస్తున్నాయట. వాళ్ళు చేస్తున్న హడావిడితో… పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అంతకు మించి పార్టీలో గందరగోళ వాతావరణం ఎక్కువ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఏదో ఒకటి తేల్చాకే … స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనపడుతోంది. అయితే అంతకంటే ముందే జూబ్లీహిల్స్ బైపోల్ జరిగే అవకాశం ఉండటం సొంత పార్టీలోనే పోటీని పెంచినట్టు చెప్పుకుంటున్నారు. బరిలో దిగేందుకు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించలేదన్న చర్చను లేవనెత్తారాయన. అ దిశగా వత్తిడి పెంచేందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, కటౌట్లతో హోరెత్తిస్తున్నారు అంజన్. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎటువెళ్లినా… అంజన్ కుమార్ యాదవ్ పేరుతో పోస్టర్స్, కటౌట్ల హంగామానే కనిపిస్తోంది.
Read Also: Off The Record: అక్కడ జనసేనలో నామినేటెడ్ చిచ్చు.. మూకుమ్మడిగా పవన్ దృష్టికి..
Also Read
యాదవ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ కూడా పోటీపడుతున్నా… హడావుడి అంతా అంజన్ టీంలోనే కనిపిస్తోంది. ఇక రెడ్ల వైపు నుంచి నుంచి సీఎన్ రెడ్డి కూడా సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు. ప్రచారాన్ని కూడా అదే తరహాలో నిర్వహిస్తున్నారాయన. ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు కటౌట్లు హోర్డింగ్స్‌తో ఆయన కూడా తనవైపు దృష్టి మళ్ళించుకునే ప్లాన్‌లో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి సిఎన్ రెడ్డి కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నట్లు కనపడుతోందంటున్నారు పరిశీలకులు. బీసీ నుంచి అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ పోటీపడుతుంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎన్ రెడ్డి ఒక్కరే ఇప్పటివరకు బయటకు వచ్చారు. బీసీ కోటాపై తీవ్ర చర్చ జరుగుతున్న ఈ సందర్భంలోనే సీఎన్ రెడ్డి గట్టిగా ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది. పార్టీలో ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ మీద కన్నేశారన్న సమాచారం అందుతోంది. బహిరంగ చర్చ కాకపోయినా పార్టీలో నాయకుల మధ్య అంతర్గత చర్చలో కీలకంగా వినిపిస్తున్న పేరు ఇదే. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా…
ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నాయకుల మధ్య పోటీ మాత్రం కాక రేపుతోంది. పోటాపోటీ హోర్డింగ్స్, ప్లెక్సీలు హీట్ పెంచుతున్నాయి. పార్టీ పెద్దలు కూడా వీటన్నిటినీ గమనిస్తూనే ఉన్నారట. ఎవరి ప్రయత్నాలు వాళ్ళని చేసుకోనివ్వండి, ఎవరేం చేసినా… అంతిమంగా బెనిఫిట్ అయ్యేది పార్టీనే కదా అన్న ఫీలింగ్‌లో ఉన్నారట పెద్దలు. సహజంగానే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఢిల్లీలో జరుగుతుంది. కాబట్టి గల్లీలో ఎవరి గోల వాళ్ళను చేయనివ్వండన్నది గాంధీభవన్ ఇన్‌సైడ్ టాక్.
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!