Kondapur Pub: డిస్కౌంట్ విషయంలో గొడవ.. పబ్ సిబ్బందిపై 20 మంది విచక్షణారహితంగా దాడి!
- 20 మంది స్నేహితులంతా కలిసి పబ్‌కు
- అర్థరాత్రి వరకు ఫుల్లుగా తాగారు
- డిస్కౌంట్ విషయంలో గొడవ
- పబ్ సిబ్బందిపై 20 మంది విచక్షణారహితంగా దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్నేహితులంతా కలిసి పబ్‌కు వెళ్లారు. అర్థరాత్రి వరకు ఫుల్లుగా తాగారు. బిల్లు కట్టే విషయంలో డిస్కౌంట్ పేరుతో గొడవకు దిగారు. పబ్‌లో ఉన్న బౌన్సర్లు, మేనేజర్లతో పాటు ఇతర సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే పబ్‌లో మద్యం మత్తులో ఓ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. కొండాపూర్ వైట్‌ఫీల్డ్‌లో ఉన్న మ్యాడ్ కిచెన్ అండ్ పబ్‌లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివ, జితేశ్, ప్రశాంత్, సదానంద్పాటు సుమారు 20 మంది యువకులు కొండాపూర్ వైట్‌ఫీల్డ్ రోడ్డులో ఉన్న మ్యాడ్ క్లబ్ పబ్‌కు వెళ్లారు. అందరూ కలిసి ఫుల్‌గా మద్యం తాగారు. వారి బిల్లు రూ.18 వేలు అయింది. బిల్లు చెల్లించే సమయంలో డిస్కౌంట్ అడిగారు. కానీ పబ్ నిర్వాహకులు డిస్కౌంట్ లేదని చెప్పడంతో.. తాము పబ్ ఓనర్‌కు సంబంధించిన వారమని వాదించారు. అక్కడ ఉన్న పబ్ మేనేజర్‌తో గొడవ పడ్డారు. పబ్ ఓనర్‌ను పిలవాలంటూ హంగామా చేశారు. ఐతే అక్కడే ఉన్న బౌన్సర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై దాడికి పాల్పడ్డారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Online Fraud: చదివింది ఇంటరే కానీ.. చేసింది మాత్రం బెట్టింగ్ యాప్! చివరకు
పబ్‌లో యువకులు చేస్తున్న హంగామా అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. మేనేజర్‌తో గొడవ పడుతున్న సమయంలో బౌన్సర్లు అడ్డుకున్నారు. ఐతే వారిపై వాటర్ బబుల్స్, బాటిల్స్, రాడ్స్, ఖాళీ సీసాలు కర్రలు.. ఇలా చేతికి అందిన వస్తువులతో దాడి చేశారు. దీంతో ఈ దాడిలో బౌన్సర్లు అఫ్రోజ్, ప్రశాంత్, మాజీద్, రషీద్, చరణ్ గాయపడ్డారు. వారిని కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పబ్ ఓనర్ ప్రశాంత్ మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!