Petrol Bunks: హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో కొనసాగుతున్న రద్దీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Stations: హిట్ అండ్ రన్ యాక్ట్ పుణ్యామా అని రెండో రోజు పెట్రోల్ బంకుల దగ్గర వెహికిల్స్ రద్దీ కొనసాగుతుంది. నిన్న ఒక్కసారిగా వాహనదారులు బంకుల దగ్గరకు చేరుకోవడంతో బంకులో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి. రాత్రి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు చేరుకోవడంతో బంకుల దగ్గర సరఫరా కొనసాగుతుంది. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంక్‌ల వద్ద వెహికిల్స్ పెద్ద ఎత్తున బారులు తీరారు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంలో జనాలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని వాహనదారులు ముందు జాగ్రత్త చర్యగా తెల్లవారుజాము నుంచే బంకుల దగ్గరకు చేరుకుంటున్నారు. బంక్‌లు ఇంకా ఓపెన్ కాకముందే వెహికిల్స్ ను వరుసగా కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడి ఉన్నారు. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతుంది.
Read Also: Shivani Rajashekar: నాజూకు నడుము అందాలతో అలరిస్తున్న శివాని రాజశేఖర్…
Also Read
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
అయితే, జనవరి 1 నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు నిరసనకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా ఆగిపోయింది. ఇప్పటికే నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు క్లోజ్ చేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి. అయితే, తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్‌లో వెహికిల్స్ పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసి వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్‌లతో బారులు తీరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!