నేడు గాంధీభవన్‌లో మద్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ మీటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల చైర్మన్లు, పాల్గొంటారు. ఇక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్య సంతరించుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆయన స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నియమితురాలైన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన దీపాదాస్ మున్షీకి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డితో పాటు పలువురు నేతలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు.
Read Also: Insurance Money: కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్నేహితుడినే చంపేశాడు..
కాగా, అయితే, తొలుత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ హోదాలో దీపాదాస్ మున్షీ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ను ఆమె అభినందించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై కాసేపు చర్చించారు. దానికి ముందు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోనూ దీపాదాస్ మున్షీ సమావేశం అయ్యారు. అలాగే, రేపు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకుగాను అన్ని రాష్ట్రాల సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భేటీకి హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్టు సీఎంఓ తెలిపింది.