బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం లేదు అని ఆయన ప్రశ్నించారు.
Cyber Criminals: సంగారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి అధిక డబ్బు ఆశ చూపి రూ.41.29 లక్షలు కేటుగాళ్ళు కాజేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కశ్మీర్ వ్యాలీలో ఉండే అరుదైన వన్య ప్రాణిగా గుర్తింపు ఉన్న రెడ్ స్టాగ్ జింకలపై హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) పరిశోధన చేసింది. అయితే, జింకల జనాభా, జీవావరణం, సంతతిని పెంచే పలు అంశాలపై శాస్త్రీయంగా విశ్లేషించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. విపరీతంగా చలి పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నాయి. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి.
రాష్ట్రంలో పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖలో నియామకాలపై నేడు డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ధర్నా చౌక్ ని యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ధర్నా చౌక్ ని ఆయన పరిశీలించారు.
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు శీతల గాలులు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఇంటిలో ఉన్నప్పటికీ జనంలో వణుకు తగ్గడం లేదు. దీంతో చలిమంటలను జనం ఆశ్రయిస్తున్నారు. స్వెట్టర్లు, రగ్గులు కప్పుకున్నా.. చలి మాత్రం వాయించేస్తోంది. దీంతో ఇదెక్కడి చలిరా బాబు అంటూ జనం గజగజా వణుకుతున్నారు.
Swiggy: బిర్యానీ అంటే ఒక్క హైదరాబాద్ లోనే కాదు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉందని స్విగ్గీ తన వార్షిక అమ్మకాల నివేదికలో తెలిపింది. 2023లో దేశవ్యాప్తంగా ప్రతీ సెకనుకు 2.5 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ప్రతీ 5.5 చికెన్ బిర్యానీలకు ఒక వెజ్ బిర్యానీ ఉందని తెలిపింది.
వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్ట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోకో ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.