కొత్త సంవత్సరం రోజు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మెట్రో కానీ, ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను.. ఎయిర్ పోర్ట్ కి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుంది.. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో ఉంటుందన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్ పోర్టుకి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Krithi Shetty : కొత్త సంవత్సరం..సరికొత్త లుక్ లో మెరిసిన కృతి శెట్టి..
మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్ర పురం వరకు మెట్రో పొడిగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రో ని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం.. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్ పోర్ట్ కి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండరు.. మేము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుంది.. ఫార్మాసిటీని అంచలంచలుగా రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాము.. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అక్కడనే అక్కడి పరిశ్రమల్లో పని చేసే వాళ్ళకి గృహనిర్మాణం కూడా ఉంటుంది.. అక్కడి వాళ్ళు ఎవ్వరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లు క్లస్టర్లు ఉంటాయి.. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు.
Read Also: Samantha: సామ్.. కొత్త సంవత్సరం.. ఏంటీ ఈ అరాచకం..?
యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన.. పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్ పై శిక్షణ ఉంటుంది.. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయి.. స్కిల్స్ అదనంగా ఉంటాయి.. అక్కడ నుంచి బైటకి వెళ్ళే వాళ్ళకి క్యాంపస్ లోనే ఎంపిక ఉంటుంది.. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని ఆయన అన్నారు. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి లుగా బాధ్యతలు అప్పగించాం.. 100 బెడ్స్ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజ్ ఉంటుంది.. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: Masood Azhar Died: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మృతి..!
ఆయా దేశాలకు అవసరమైన మాన్ పవర్ ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందు వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తాం.. మన వద్ద పెద్ద సంఖ్యలో యువత ఉంది.. వారికీ ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తాం.. చాలా మంది సీనియర్ అధికారులు ప్రావిణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉంది.. 3 వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంది.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామని ఆయన చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం.. నాకు దగ్గరి బంధువనో పదవులు ఇచ్చేది ఉండదు.. నేను ఏది చేసినా విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తాం.. పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తాం.. ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమశ్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.