Hyderabad: సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఇవాళ్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతలుగా రోజుకో లోక్‌సభ నియో జకవర్గం చొప్పున భేటీలు కొనసాగనుంది. తొలి రోజు ఆదిలాబాద్ లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోని పార్టీ నేతలతో భేటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడెం నగేశ్‌తో పాటు ఎమ్మెల్యేలు అనిల్ జాధవ్, కోవా లక్ష్మి, ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, నియోజక వర్గాల ఇన్‌చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ముఖ్యనేతలు సుమారు 500 మంది పాల్గొంటారు.
Read Also: Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో 30నిమిషాల్లో రెండుసార్లు భూకంపం.. వణికిన మణిపూర్, బెంగాల్
కాగా, సన్నాహక సమావేశాలను కేటీఆర్‌తో పాటు పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు సమన్వయం చేయనున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. కాగా ఈ సన్నాహక సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని రెడీ చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. లోక్‌సభ సన్నాహక భేటీల ప్రారంభం నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేయాల్సిన అంశాలను కేసీఆర్ వివరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో తొలిసారిగా పార్టీ కీలక నేతలందరూ హాజరవుతుండటంతో ఈ సన్నాహక సమావేశాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి కొనసాగుతుంది.