PM Modi:పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరగనుంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పాలమూరు-నాగర్ కర్నూల్-నల్గొండ పార్లమెంట్ స్థానాలకు కలిపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో కవిత ఇంటికి కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వాదించారు. అధికారులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు మూడు గంటలకుపైగా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు వచ్చారని తెలుసుకున్న కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ ఆమె ఇంటికి వచ్చారు. అయితే ఈడీ అధికారులు ఆయనను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో సోమ భరత్ కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుండి ఈడీ అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదన్నారు. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్ ఉంది.. పెండింగ్ లో కేసు ఉండగా ఈడీ అధికారులు…
హైదరాబాద్ మల్కాజ్గిరిలో పోలీస్ హై అలర్ట్ నిర్వహించారు. ప్రధాని మోడీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ విజయ సంకల్ప రోడ్ షో చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రత నిర్వహించనున్నారు. మల్కాజ్గిరిలో మోడీ రోడ్ షో 1.3 కిలోమీటర్, గంట పాటు సాగనుంది. అందుకోసమని.. రెండు వేలకు పైగా10 అంచెల పోలీస్ భారీ భద్రత చేపట్టనున్నారు.
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ సోదాలు చేపట్టింది. కవిత నివాసంలో నాలుగు టీమ్లుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
100 రోజుల పరిపాలన పై ప్రజలు పండుగ చేసుకోవాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన చేయడంలో విఫలమైంది.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కొనసాగిస్తుందన్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి తన సందేశాన్ని వినిపిస్తారు.
వరల్డ్ కిడ్ని డేను పురస్కరించుకుని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని స్టార్ హాస్పిటల్స్లో ప్రపంచ కిడ్నీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అందించే స్టార్ సెలబ్రిటీ అవార్డులను కిడ్నీ మార్పిడి చేయించుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వారికి ప్రదానం చేశారు.