హైదరాబాద్ రాచకొండలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఓపీయం, ఎండీఎమ్ఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ, 500 గ్రాముల ఓపీఎంను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Indrakaran Reddy: అనుచరులతో ఇంద్రకరణ్రెడ్డి సమావేశం.. త్వరలో కాంగ్రెస్లోకి..?
రాజస్థాన్‌లో గ్రాము ఎండీఎంఏ రూ.5 వేలకు, గ్రాము ఓపీయం రూ.2 వేలకు కొని హైదరాబాద్‌లో 10 నుంచి 12 వేలకు నిందితులు విక్రయిస్తున్నారు. నిందితులపై గతంలో కూడా ఎన్టీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి పోలీసులు మరింత సమాచారం రాబడుతున్నారు. డ్రగ్స్ ఎవరెవరికీ విక్రయించారన్న దానిపై కూడా వివరాలు సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: AP Election Campaign: ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న బీజేపీ అగ్రనాయకులు..