TS AP Rains: హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వరుణుడు చల్లబడ్డాడు. చల్లటి గాలులు, చిరు జల్లులు హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగించాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. కూకట్ పల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఈ చలి మరో మూడు నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉదయం నుంచి ఎండలు మండుతున్నప్పటికీ…
దేశంలో పెరుగుతున్న ఆటిజం కేసుల దృష్ట్యా.. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ (ASD) ద్వారా ప్రభావితమవుతున్న నేపథ్యంలో.. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మార్చి 16, 17 తేదీలలో హైదరాబాద్లో రెండు రోజుల పాటు ‘ఆటిజం ఒడిస్సీ’ పేరిట జాతీయ సదస్సును నిర్వహించింది. బంజారా హిల్స్ రోడ్ నెం. 2లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నెం. 10లోని రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్ ఈ మహోన్నత కార్యక్రమానికి వేదికగా నిలిచాయి.…
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో.. ప్రజలు రిలాక్స్ అవుతున్నారు. కొండపూర్, మియాపూర్, చందానగర్, ఆర్సీపూరం, బీరంగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ పాతబస్తీ మీర్చౌక్ ఆఘా కాలనీలో దారుణ హత్య కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో షేక్ వాజిద్ అనే వ్యక్తిని నిసార్ అహ్మద్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, మీర్ చౌక్ ఏసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. హత్యకు గల కారణాలు ఆర్థిక లావాదేవీలే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad Rain: హైదరాబాద్లో అక్కడక్కడ వర్షం కురిసింది. మొజంజాహీ మార్కెట్, నాంపల్లి, లకిడికపూల్, ఖైరతాబాద్, పటు నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం వర్షం కురిసింది.
AP- TS 10th Class Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఐదు నిమిషాల అదనపు గ్రేస్ టైమ్ ఇచ్చారు.
చాలా రోజుల తర్వాత చెడ్డీ గ్యాంగ్ సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. వరల్డ్ వన్ స్కూల్ లోకి కొంతమంది చెడ్డీలు ధరించి.. ముఖానికి మాస్క్ కట్టుకుని పదునైన ఆయుధాలతో ఒంటిమీద బట్టలు లేకుండా చొరబడ్డారు. అనంతరం స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల కౌంటర్ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు.
వీధికుక్కలు సైరవిహారం చేస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. హైదరాబాద్ నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన శామీర్ పేట అద్రాస్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
నాగ చైతన్య సినిమా జోష్ తో తన సినీ కెరీర్ను ప్రారంభించిన సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. పదేళ్ల క్రితమే నటుడిగా సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ మధ్య డీజే టిల్లు అంటూ వచ్చి.. భారీ హిట్ అందుకున్నాడు జొన్నలగడ్డ . ఆ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపింది. కేవలం…
Telangana Weather: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. భానుడు భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఐఎండీ చల్లటి కబురు చెప్పింది.