వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఇవాళ వరంగల్ నియోజకర్గం పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతున్నారనే వార్తల నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Cyber Frauds: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. ప్రజల్ని బురిడీ కొట్టించి డబ్బులు దోచేయాలనే ఉద్దేశంతో పూటకో కొత్త ఐడియా వేస్తున్నారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు అంటూ కొందరు మోసాలకు పాల్పడుతుంటే..
కాసేపట్లో చార్మినార్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్న అమిత్ షా.. మీటింగ్ అనంతరం చార్మినార్ బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ భాగ్యలక్ష్మీ టెంపుల్ కు చేరుకుని .. భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్నారు అమిత్ షా. అమిత్ షా పర్యటన సందర్భంగా.. టెంపుల్ దగ్గర భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. CAA అమలు తరువాత తొలిసారి ఓల్డ్ సిటీకి వస్తున్నారు. దీంతో భద్రత కట్టుదిట్టం చేశారు.
Indiramma Houses: తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో.. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ‘కోహినూర్’ వజ్రం గురించిన కథ కూడా ఉంటుంది. తెలంగాణ భూముల్లోనే కోహినూర్ వజ్రం లభించిన సంగతి…
గత తొమ్మిదేళ్లలో ఎవిస్ ఆసుపత్రి ప్రస్థానంలో మహిళా ఉద్యోగుల పాత్ర అద్వితీయమని ఆసుపత్రి మానేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజా.వి.కొప్పాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా శనివారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రోగులకు సేవలకు సంబంధించి ఇన్నేళ్లలో నాలుగు ఫిర్యాదులు మినహా ఎటువంటి సమస్యలు లేకపోవడం విశేషమన్నారు.
జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ రహదారి (NH)44పై దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు రూ.1,580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.320 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడ్లకోయ జంక్షన్ సమీపంలో శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి…