Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బహదూర్ పూరాలోని అసద్ బాబానగర్ లో ఓ వ్యక్తిని కత్తులో విచక్షణారహితంగా పొడిచి చంపారు. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Read also: Tanzania : టాంజానియాలో వరదల విధ్వంసం, 58 మంది మృతి.. నిరాశ్రయులైన లక్షలాది మంది
బహదూర్ పూరాలోని అసద్ బాబానగర్ లో ఖలీల్ అనే వ్యక్తి తమ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. అయితే కొందరు యువకులు అర్ధరాత్రి ఖలీల్ ఇంటికి వెళ్లారు. ఖలీల్ తో మాట్లాడాలని ఇంటి నుండి బయటకు తీసుకుని వచ్చారు. మాట్లాడుతూ వారి వెంట తెచ్చుకున్న కత్తులతో ఖలీల్ పై దాడికి దిగారు. ఖలీల్ గట్టిగ కేకలు వేయడంతో తండ్రి బయటకు పరుగున వచ్చాడు. అప్పటికే ఖలీల్ ను ఆగంతకు చుట్టుముట్టి కత్తులో విచక్షణారహితంగా దాడి చేస్తున్నడంతో తండ్రి అడ్డుపడ్డాడు. తండ్రిని బెదిరించాడు. ఏమీ చేయని నిస్సాయస్థితిలో తండ్రి ఉండిపోయాడు.
తన కొడుకును కాపాడాలని కేకలు వేసిన ఎవరూ ముందుకు రాలేదు. కన్న తండ్రి ముందే కొడుకు ఖలీల్ ను కత్తులో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఖలీల్ తన ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు పెట్టినా వెంటాడి వేటాడి చంపారు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన చేరుకున్నారు. అయితే అప్పటికే ఖలీల్ ప్రాణాలు వదిలాడు. కొడుకు ఖలీల్ తన కళ్లముందే ప్రాణాలు వదలడంతో తండ్రి గుండెబాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. తన కొడుకును కొందరు వచ్చి మూకుమ్ముడిగా దాడి చేశారని వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Dinesh Karthik: లేటు వయస్సులో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు.. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు పక్కా!