Akbaruddin Owaisi Key Comments: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చంద్రయాన్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. పాతబస్తీ ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా సోదరులను జైలుకు పంపాలని కొందరు అన్నారు. జైల్లో మందు పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి మమ్మల్ని చంపేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మేం చాలా బలంగా ఉన్నామని, అందుకే మమ్మల్ని ఓడించాలని చూస్తున్నారని అన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా మేమే గెలుస్తామని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. జైల్లోనే స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేయడం ఇప్పుడు అందరిలోనూ పలు అనుమానాలకు దారి తీస్తోంది.
Read also: TS RTC: ఆర్టీసీ బస్సుల పై సమ్మర్ ఎఫెక్ట్.. మధ్యాహ్నం సర్వీసుల తగ్గింపు..
రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఎంఐఎం పార్టీ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధికి సహకరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. కొందరు కాంగ్రెస్ బీ టీమ్ అంటూ ప్రచారం చేస్తున్నారని, అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తమతో కలుస్తున్నారని అన్నారు.
Read also: Dr K Laxman: కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాయిదాల పార్టీ నా.?
ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఎంఐఎంను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని అక్బరుద్దీన్ అన్నారు. రావులు, రెడ్లు ఎంతమంది కలిసినా విజయం వారిదే అన్నారు. మా ఇద్దరి సోదరులను జైలుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మందు పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అలాంటి వాటికి భయపడేది లేదని, హైదరాబాద్‌లో తాము చాలా బలంగా ఉన్నామని.. అందుకే మమ్మల్ని ఓడించాలని చూస్తున్నారని అన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలుస్తామని అక్బరుద్దీన్ దీమా వ్యక్తం చేశారు.
BRS KTR: వరంగల్ పార్లమెంటుకు సమన్వయకర్తలను నియమించిన కేటీఆర్