ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అనేకచోట్ల గంజాయి, మాదక ద్రవ్యాలకి సంబంధించిన పలు కేసులు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు దేశవ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అనేక చోట్ల దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇలాంటి కేసులు మరికొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల మాదకద్రవ్యాలకి సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి చూశాయి.
Also Read: Anand Mahindra: ధోనిని పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన ఆనంద్ మహీంద్రా.. ట్వీట్ వైరల్..!
ఇకపోతే తాజాగా తెలంగాణలో ఓ కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా పోలీసులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ – జగద్గిరిగుట్ట రోడ్ నం.1 లో జయ ట్రేడర్స్ అనే కిరాణా షాపులో రూ.2.66 లక్షల విలువైన 6400 గంజాయి చాక్లెట్లతో పాటు 4 కిలోల గంజాయి పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Yarlagadda Venkatrao: గన్నవరం హరిజనవాడకు చెందిన 500 మంది టీడీపీలో చేరిక..
గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న కిరాణా షాపు యజమాని మనోజ్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసి పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.
తెలంగాణలో విచ్చలవిడిగా పెరిగిన గంజాయి చాక్లెట్లు!
కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు
హైదరాబాద్ – జగద్గిరిగుట్ట రోడ్ నం.1లో జయ ట్రేడర్స్ అనే కిరాణా షాపులో రూ.2.66 లక్షల విలువైన 6400 గంజాయి చాక్లెట్లతో పాటు 4 కిలోల గంజాయి పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి చాక్లెట్లు… pic.twitter.com/cxuj78T8eJ
— Telugu Scribe (@TeluguScribe) April 14, 2024