Cricket Betting: ఐపీఎల్ వచ్చిందంటే చాలు నగరంలో బెట్టింగ్ ముఠాలు చెలరేగుతాయి. రోజు కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. యువత బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులతో ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటి పోలీసులు ఐదు బెట్టింగ్ ముఠాలను ఏకకాలంలో పట్టుకున్నారు. ఐదు ముఠాల నుంచి రెండున్నర కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 15 మందిని అరెస్టు చేశారు. వారికి సంబంధించి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు. ఈ ముఠాలు ప్రతిరోజు కోట్ల రూపాయల బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకొని బెట్టింగ్లకు పాల్పడ్డారు. ఐపీఎల్ సీజన్లో పెద్ద మొత్తంలో బెట్టింగ్లో పాల్పడుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: IPL 2024: ఈరోజు గెలిస్తేనే ప్లే ఆఫ్స్కు అవకాశం..!