Hyderabad Fire Accident: హైదరాబాద్ నగరంలోని మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపో (ICD)లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. గోదాంలో నిల్వ ఉంచిన రసాయన విభాగంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. కార్పొరేషన్ గోదాంలో ఉన్న లిక్కర్ నిల్వ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
Read Also: Delhi: ఢిల్లీలో భారీగా డ్రగ్స్, బంగారం, గంజాయి పట్టివేత
ఇక, ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి 6 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. రెండు ఆటోమేటిక్ రోబోలు. నలువైపుల నుంచి మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటల్లో పెద్ద ఎత్తున లిక్కర్ దగ్ధమైనట్లు అధికారులు గుర్తించారు. కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం వాటిలినట్టు గుర్తించారు. ఈ అగ్నిప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.