Rave Party: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. వారి నుంచి గంజాయి ప్యాకేట్స్, ఈ సిగరేట్, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా మధుర జ్ఞాపకం అన్నారు. మా ప్రభుత్వం 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.. మరో 35 వేల ఉద్యోగాలను ఈ ఏడాది చివరిలోగా ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు.
CM Revanth Reddy: ఐఐహెచ్టీ (IIHT)కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించామని.. ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మత సామరస్యాన్ని చాటే ఘటనలు చాలా చోట్ల చూస్తుంటాం.. హైదరాబాద్కు చెందిన ఓ ముస్లిం యువకుడు.. ప్రతీ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు.. ఫారిన్ నుండి వచ్చి మరీ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్నాడు.. ప్రతీ ఏడాది మూడు నెలల ముందే వచ్చి.. ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుంటాడు.. ఇది ఏ ఒక్కసారికే పరిమితం కాలేదు.. వరుసగా 19 ఏళ్ల నుంచి గణేష్ నవరాత్సి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు.. అతడే హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిద్ధిఖీ..
Traffic Constable: ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఘట్కేసర్లో చోటుచేసుకుంది. నగరంలోని ట్రాఫిక్ పీఎస్ సికింద్రాబాద్ గోపాలపురంలో నరసింహారాజు ట్రాఫిక్ కానిస్టేబుల్ పీసీ 9782 (2009 బ్యాచ్) విధులు నిర్వహిస్తున్నాడు.
హైదరాబాద్లోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Balapur Ganesh Laddu: వినాయక చవితి.. ప్రపంచంలో హిందువులు ఏ ఖండంలో ఉన్నా చేసుకునే పెద్ద పండుగ. మన దేశంలో ప్రజలు సామూహికంగా మండపాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తిభావంతో జరుపుకునే పండుగ వినాయక చవితి. ప్రత్యేక రూపాల్లో చేసిన గణపతులు ఒక ఎత్తు అయితే.. లడ్డు వేలం పాట మరొక ఎత్తు. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఈ శోభ పతాకస్థాయిలో ఉంటుంది. ఈ పండుగను మిగతా ప్రాంతాల్లో పోలిస్తే హైదరాబాద్లో ఘనంగా జరుపుకుంటారు.
Harish Rao: జైనూర్... ఘటన అత్యంత పాశవికంగా జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈమధ్య కాలంలో తరుచుగా ఇటువంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.