హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్-కన్వెన్షన్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని నాగార్జున పేర్కొన్నారు
ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుందని, వక్ఫ్‌ను ఖతం చేయాలని అనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా బీజేపీ చేయాలనుకుంటుందని అసదుద్దీన్ మండిపడ్డారు. ఈరోజు దారుస్సలాంలో ఎంపీ…
Cyber Crime in SBI Bank: దేశంలో రోజురోజుకు ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొత్తకొత్త మార్గాల్లో అమాయకుల బ్యాంక్ ఖాతా నుండి డబ్బును ఈజీగా దొంగిలిస్తున్నారు. అమాయక ప్రజలనే కాదు.. బ్యాంక్‌లను కూడా దోచేసుకుంటున్నారు. తాజాగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కే టోకరా వేశారు. ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఏకంగా 175 కోట్లు మాయం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ షంషీర్గంజ్ ఎస్బీఐ బ్యాంక్‌లో చోటుచేసుకుంది. సైబర్…
Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ( ఆదివారం ) మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ కు రెండు సార్లు వచ్చిన ఆయన.. ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్లో టీ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు.
Hyderabad Marathon 2024: హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 13వ ఎడిషన్ ఈరోజు (ఆదివారం) లాంఛనంగా స్టార్ట్ అయింది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది.
పూణే జిల్లాలోని పౌడ్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం పూణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఎన్- కన్వెన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేచ్చారని పిటిషన్ వేశారు.
తుమ్మిడి కుంట చెరువుకు మరోవైపు ఉన్న తాత్కాలిక నిర్మాణాలను కూడా భారీ బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలను సైతం వరుసగా కూల్చి వేస్తున్నారు. అక్రమంగా చెరువు స్థలంలో బోర్లు వేసి అక్రమార్కులపై కూడా అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు.
Nagarjuna Akkineni: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం పూర్తిగా కూల్చి వేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులను కొనసాగించింది. ఈ కూల్చివేతపై నాగార్జున తొలి సారి స్పందించారు.