Khairatabad Ganesh: హుస్సేన్ సాగర్ నుంచి ఖైరతాబాద్ గణపతి అవశేషాల తొలగింపు..
- హుస్సేన్ సాగర్ నుంచి మహా గణనాథుడి ఉక్కు మాతృకలను సిబ్బంది బయటకు వెలికితీశారు..
- హుస్సేన్ సాగర్ నుంచి ఖైరతాబాద్ గణపతి అవశేషాల తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khairatabad Ganesh: హుస్సేన్ సాగర్ నుంచి అవశేషాల తొలగింపులో భాగంగా మహా గణనాథుడి ఉక్కు మాతృకలను సిబ్బంది బయటకు వెలికితీశారు. నిన్న(శుక్రవారం) గణనాథుడి ఉక్కు మాతృకలను బయటకు తీశారు. ఈ నెల 17న హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. 11 రోజుల పాటు లక్షలాది మందిని ఆశీర్వదించిన 70 అడుగుల విఘ్నేశ్వరుడు మంగళవారం పూర్తిగా నిమజ్జనం అయ్యారు. మహా గణపతి శోభాయాత్ర ఈ నెల 17న ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు ముగిసింది. మహాగణపతిని ట్రైలర్‌పైకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ క్రూయిజ్ క్రేన్‌ను ఉపయోగించారు. ఈ క్రేన్‌లోని 142 అడుగుల జాక్‌ను 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఎత్తడానికి ఉపయోగించారు. కాగా, మహాగణపతి హుండీ ద్వారా రూ.75 లక్షల ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

Also Read
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖైరతాబాద్ వినాయకుడి ఉక్కు మాతృకలను తీసే పనులు జరుగుతాయని క్రేన్ ఆపరేటర్ అన్వర్ పేర్కొన్నారు. నిమర్జనం ఐన మూడురోజుల తర్వత ఖైరతాబాద్ బడా గణేష్ ను క్రేన్ సహాయంతో బయటకు తీశారు.

అనంతరం హుస్సేన్ సాగర్‌లో పేరుకు పోయిన మురికిని బయటకు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. నిమజ్జనం తరువాత మట్టి, చెత్త, పూలను తొంగించే పనిలో నిమగ్నమయ్యారు. తీసిన చెత్తను డంప్ లకు తీసుకుని వెళుతున్నారు.

ఈ కార్యక్రమాన్ని సుమారు 20 మందికి పైగా ఈ ఉక్కును తొలగించేందుకు ఉంటారు. రవి క్రేన్ నుంచి ఈ చెత్తను బయటకు తీస్తామని పేర్కొన్నారు. 2007 నుంచి ఈ రవి క్రేన్ ద్వారానే వినాయక నిమజ్జనానికి, ఆ తరువాత చెత్తను తీసేందుకు కూడ వాడతారని పేర్కొన్నారు.

తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!